అశోక్‌ లేలాండ్‌ ‘సారథి సురక్ష’ పాలసీ

భారీ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్‌ లేలాండ్‌ ‘సారథి సురక్ష’ పాలసీని తీసుకొచ్చింది. చోదకుల వర్గాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా రూ.10 లక్షల బీమా కవరేజీతో ఈ పాలసీని ఆవిష్కరించింది.

Published : 05 Jun 2024 02:36 IST

చెన్నై: భారీ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్‌ లేలాండ్‌ ‘సారథి సురక్ష’ పాలసీని తీసుకొచ్చింది. చోదకుల వర్గాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా రూ.10 లక్షల బీమా కవరేజీతో ఈ పాలసీని ఆవిష్కరించింది. దీన్ని ‘అన్‌నేమ్డ్‌ జీపీఏ (గ్రూప్‌ పర్సనల్‌ యాక్సిడెంట్‌) పాలసీ’గా వర్గీకరించారు. అశోక్‌ లేలాండ్‌ వాహనాన్ని నడుపుతున్న చోదకులకు అనుకోని ప్రమాదం జరిగితే బీమా కవరేజీ అందేలా దీన్ని తీర్చిదిద్దారు. ఇది ఒక సమగ్ర బీమా పాలసీ. ప్రమాదంలో మరణించినా, పూర్తిగా లేదా పాక్షిక అంగ వైకల్యం సంభవించినా బీమా వర్తిస్తుంది. అలాగే వారి పిల్లలకు ప్రత్యేకంగా విద్యా బోనస్‌ కూడా లభిస్తుంది. ‘లాజిస్టిక్స్, రవాణా రంగాల్లోని మా చోదకులు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారి కోసం సారథి సురక్ష పాలసీని తీసుకొచ్చాం. వారి భద్రత, మంచి కోరుకోవడంతో మా నిబద్ధతకు ఇదొక నిదర్శనమ’ని అశోక్‌ లేలాండ్‌ ఎండీ, సీఈఓ షెను అగర్వాల్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని