అంకురాల కోసం ఐఓబీ ప్రత్యేక శాఖ

ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం చెన్నైలో ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేసింది.

Published : 07 Jun 2024 03:31 IST

చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం చెన్నైలో ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా ఇలాంటి మరో 5 శాఖలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. ‘ఐఓబీ స్టార్టప్‌ కరెంట్‌ ఖాతా’తో పాటు రుణ పథకమైన ‘ఐఓబీ ప్రగతి’ని ఈ శాఖలో ప్రారంభించింది. ‘మన ఆర్థిక వ్యవస్థలో వినూత్నత, ఉద్యోగాల సృష్టికి అంకురాలు మూలస్తంభాలు. ఈ ప్రత్యేక శాఖ ద్వారా, అంకుర సంస్థలు ఎదుర్కొంటున్న ఆర్థిక అవరోధాలను అధిగమించేలా చేస్తామ’ని ఐఓబీ ఎండీ, సీఈఓ అజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ తెలిపారు. అంకురాల వ్యవస్థ వృద్ధి చెందేందుకు తమవంతు మద్దతు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు