టెక్‌ పయనీర్స్‌ జాబితాలో దేశీయ అంకురాలు 10

కృత్రిమ మేధ (ఏఐ)లో సరికొత్త ఆవిష్కరణలు చేసిన అగ్రగామి 100 అంకురాల జాబితాను ‘టెక్నాలజీ పయనీర్స్‌ 2024’ పేరిట ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) విడుదల చేసింది.

Published : 07 Jun 2024 03:42 IST

ప్రపంచ ఆర్థిక వేదిక వెల్లడి 

దిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ)లో సరికొత్త ఆవిష్కరణలు చేసిన అగ్రగామి 100 అంకురాల జాబితాను ‘టెక్నాలజీ పయనీర్స్‌ 2024’ పేరిట ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) విడుదల చేసింది. ఈ జాబితాలో మనదేశం నుంచి 10 అంకురాలకు చోటు లభించింది. స్వచ్ఛ ఇంధన ఆవిష్కారాలు, ఆరోగ్య సంరక్షణలో వినూత్నత, బయోటెక్, అంతరిక్ష, న్యూరోటెక్నాలజీల్లో ప్రగతి సాధించిన సంస్థలు ఇందులో ఉన్నాయి.

హైదరాబాద్‌ కంపెనీ  నెక్స్ట్‌వేవ్‌: తెలుగు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలైన రాహుల్‌ అట్టులూరి, శశాంక్‌ రెడ్డి గుజ్జుల, అనుపమ్‌ పెడర్ల ఏర్పాటు చేసిన నెక్స్ట్‌వేవ్‌ కూడా ఈ జాబితాలో స్థానం పొందింది. చిన్న పట్టణాల్లోని విద్యార్థులకు ఏఐ ఆధారిత కోడింగ్‌ కోర్సులను ఆన్‌లైన్‌లో అందిస్తోంది ఈ సంస్థ. 

  • ఏఐ ఆధారిత, ముందస్తు దశ రొమ్ము కేన్సర్‌ పరీక్షను నిరమాయ్‌ అభివృద్ధి చేస్తోంది. ఈ పరీక్షల అందుబాటు ధరలో, స్పర్శ రహితంగా ఉండనుంది.
  • పిక్సెల్‌ జియోస్పేషియల్‌ డేటాను అందించే హైపర్‌స్పెక్ట్రల్‌ శాటిలైట్‌ ఇమేజినరీని అభివృద్ధి చేస్తోంది. 
  • భారతీయ భాషల వినియోగానికి ఏఐ మోడళ్లు, ప్లాట్‌ఫారాలను సర్వమ్‌ ఏఐ సిద్ధం చేస్తోంది.
  • యాంపియర్‌అవర్‌ అయితే పునరుత్పాదక ఇంధనాన్ని నిల్వ చేసుకునే సొల్యూషన్లను సృష్టిస్తోంది. 
  • క్రాప్‌ఇన్‌ అనే మరో అంకురం రైతులు తమ పొలాలకు జియో-టాగ్‌ చేసుకునేందుకు, వ్యవసాయ రికార్డులను డిజిటలీకరణ చేసుకునేందుకు ఒక పర్యవేక్షణ, నిర్వహణ పరిష్కారాన్ని అభివృద్ధి చేస్తోంది.
  • భారతీయ స్థానిక భాషల్లో ప్రోగ్రాములను నేర్చుకోవడానికి, మెరుగుపరచుకోవడానికి యాక్సెస్‌ను ఎంట్రీ అందిస్తోండగా.. హెల్త్‌ప్లిక్స్‌ అనేది ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్‌ మెడికల్‌ రికార్డులను అభివృద్ధి చేస్తోంది.
  • ఇంటర్నేషనల్‌ బ్యాటరీ కంపెనీ భారీ పరిమాణంలో రీఛార్జబుల్‌ ప్రిస్మాటిక్‌ లిథియం అయాన్‌ నికెల్‌ మాంగనీజ్‌ కోబాల్ట్‌ బ్యాటరీలను తయారు చేస్తోంది.
  • జీహెచ్‌జీ వాయువుల నుంచి వ్యవసాయానికే కాకుండా, జంతువులు, మానవులకు ఉపయోగపడే పోషకాలను స్ట్రింగ్‌ బయో తయారు చేస్తోంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు