అన్నా యూనివర్సిటీ అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌తో ఆంధ్రా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఒప్పందం

అన్నా యూనివర్సిటీ ఇంక్యుబేషన్‌ ఫౌండేషన్‌లోని అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌తో ఆంధ్రా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.

Updated : 09 Jun 2024 03:17 IST

చెన్నై: అన్నా యూనివర్సిటీ ఇంక్యుబేషన్‌ ఫౌండేషన్‌లోని అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌తో ఆంధ్రా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అంకుర పర్యావరణ వ్యవస్థను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఒప్పందం చేసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ వ్యూహాత్మక ఒప్పందం.. ఇద్దరు భాగస్వాములు తమ బలాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది. ఆంధ్రా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ వీఎల్‌ ఇందిరా దత్, అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ డైరెక్టర్, సీఈఓ పి.ఉమామహేశ్వరి ఈ విషయమై ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఆంధ్రా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌తో కలిసి అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ అంకురాలను ప్రోత్సహించనుంది. ఇందుకు అవసరమైన కార్యక్రమాలను నిర్వహించనుంది. తొలుత సామాజిక రంగాలపై దృష్టి కేంద్రీకరించి, తర్వాత అంకురాల ఆసక్తుల మేరకు ఇతర రంగాలకు విస్తరించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని