ప్రతిభావంతులకు పెద్ద పీట వేస్తున్న కంపెనీలు

దేశంలోని కార్పొరేట్‌ సంస్థలు, ప్రతిభావంతులైన ఉద్యోగులను అట్టేపెట్టుకునేందుకు పలు విధాలా ప్రయత్నిస్తున్నాయి. తమ ఉద్యోగులకు కొత్త తరహా ప్రయోజనాలు అందించేందుకు సిద్ధమవుతున్నారు.

Published : 09 Jun 2024 03:18 IST

దిల్లీ: దేశంలోని కార్పొరేట్‌ సంస్థలు, ప్రతిభావంతులైన ఉద్యోగులను అట్టేపెట్టుకునేందుకు పలు విధాలా ప్రయత్నిస్తున్నాయి. తమ ఉద్యోగులకు కొత్త తరహా ప్రయోజనాలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతిభావంతులకు మంచి వేతనంతో పాటు, వారు స్వయంగా అభివృద్ధి సాధించేందుకు మద్దతు ఇస్తున్నారు. సౌకర్యవంతమైన పని విధానాలు, ఉద్యోగుల తోబుట్టువులకూ ఆరోగ్య బీమా అందించడం, పెంపుడు జంతువుల సంరక్షణ వంటి ప్రయోజనాలను అందించడానికి కంపెనీలు ముందుకొస్తున్నాయి. రిస్క్‌ అడ్వైజరీ-బ్రోకింగ్‌ సంస్థ డబ్ల్యూటీడబ్ల్యూ నిర్వహించిన 2024 గ్లోబల్‌ బెనిఫిట్స్‌ యాటిట్యూడ్‌ సర్వేలో 76% మంది ఉద్యోగులు స్పందిస్తూ.. తాము పని చేస్తున్న  సంస్థలో కొనసాగేందుకు మంచి ప్యాకేజీ కారణమని పేర్కొన్నారు. 2/3 వంతు ఉద్యోగులు తమ వేతన ప్యాకేజీ మారకపోయినా, ఉత్తమ ప్రయోజనాలను ఆశించి, ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలేస్తున్నామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని