ఎన్‌విడియా మార్కెట్‌ విలువ 3 లక్షల కోట్ల డాలర్లకు

కంప్యూటర్‌ చిప్‌ తయారీ కంపెనీ ఎన్‌విడియా మార్కెట్‌ విలువ 3 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.250 లక్షల కోట్ల)కు చేరింది. ఈ స్థాయికి చేరిన తొలి చిప్‌ తయారీ కంపెనీ ఇదే.

Published : 09 Jun 2024 03:20 IST

ఈ ఘనత సాధించిన తొలి చిప్‌ తయారీ కంపెనీ ఇదే
ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానానికి సంస్థ అధిపతి

కంప్యూటర్‌ చిప్‌ తయారీ కంపెనీ ఎన్‌విడియా మార్కెట్‌ విలువ 3 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.250 లక్షల కోట్ల)కు చేరింది. ఈ స్థాయికి చేరిన తొలి చిప్‌ తయారీ కంపెనీ ఇదే. దీంతో ఆ సంస్థ అధిపతి జెన్సెన్‌ హువాంగ్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో పైపైకి వెళుతున్నారు. వ్యక్తిగత కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్‌ కంప్యూటర్స్‌ సీఈఓ మైఖేల్‌ డెల్‌ను సంపద పరంగా హువాంగ్‌ అధిగమించి ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ ర్యాంకును సొంతం చేసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. హువాంగ్‌ సంపద ఏడాది కాలంలో 62 బిలియన్‌ డాలర్లకు పైగా పెరిగి 106.1 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8.8 లక్షల కోట్ల)కు చేరింది. కృత్రిమ మేధకు అవసరమయ్యే చిప్‌లను ఎన్‌విడియా తయారు చేయడం ఇందుకు కారణం. మైఖేల్‌ డెల్‌ నికర సంపద 105.9 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని