మెట్రో స్టేషన్లలోనే చెక్‌ ఇన్‌

దిల్లీ మెట్రో, దిల్లీ ఎయిర్‌పోర్ట్‌తో ఎయిరిండియా జట్టు కట్టింది. దిల్లీలోని రెండు మెట్రో స్టేషన్లలో అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు చెక్‌-ఇన్‌ సదుపాయం కల్పించడం ఈ భాగస్వామ్య ఉద్దేశం.

Published : 09 Jun 2024 03:24 IST

బ్యాగేజీ డ్రాపింగ్‌ కూడా
దిల్లీ మెట్రో, డయల్‌తో ఎయిరిండియా జట్టు

ముంబయి: దిల్లీ మెట్రో, దిల్లీ ఎయిర్‌పోర్ట్‌తో ఎయిరిండియా జట్టు కట్టింది. దిల్లీలోని రెండు మెట్రో స్టేషన్లలో అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు చెక్‌-ఇన్‌ సదుపాయం కల్పించడం ఈ భాగస్వామ్య ఉద్దేశం. దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చెక్‌ ఇన్, బ్యాగేజీ డ్రాప్‌ సదుపాయం కల్పించినందున, మెట్రో స్టేషన్‌లోనే ప్రయాణికులు తమ బ్యాగేజీని చెకిన్‌ చేయొచ్చు. తద్వారా బయటి నుంచి వచ్చే ప్రయాణికులు, బ్యాగేజీ భారం లేకుండా నగరాన్ని సందర్శించే అవకాశం కలుగుతుంది. ఆ సమయంలో వారి బ్యాగేజీని దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(డీఎమ్‌ఆర్‌సీ), దిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌(డయల్‌) రూపొందించిన అత్యాధునిక ఆటోమేటెడ్‌ మౌలిక సదుపాయంతో విమానంలోకి చేరుస్తారు. ప్రస్తుతం దేశీయ విమాన ప్రయాణికులకు అందుబాటులో ఉన్న ఈ సేవలను, ఇకపై అంతర్జాతీయ విమాన ప్రయాణికులకూ పొడిగిస్తున్నారు. దిల్లీ, శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్లలో ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల దాకా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఎయిరిండియా తెలిపింది.  దేశీయ విమానాలు బయలు దేరడానికి 12 నుంచి 2 గంటల ముందు వరకు సామగ్రి చెక్‌ ఇన్‌ చేయొచ్చని.. అంతర్జాతీయ మార్గాల్లో విమానాలు బయలు దేరే సమయానికి 4 నుంచి 2 గంటల ముందు వరకు చెక్‌ ఇక్‌కు వీలుంటుందని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని