అనితర సాధ్యుడు రామోజీ

రామోజీరావు అసాధారణ వ్యక్తి. ఆయన దార్శనికత, నాయకత్వ లక్షణాలతో వివిధ వ్యాపార రంగాలను.. ముఖ్యంగా మీడియా రంగాన్ని ప్రభావితం చేశారు.

Published : 10 Jun 2024 01:59 IST


రామోజీరావు అసాధారణ వ్యక్తి. ఆయన దార్శనికత, నాయకత్వ లక్షణాలతో వివిధ వ్యాపార రంగాలను.. ముఖ్యంగా మీడియా రంగాన్ని ప్రభావితం చేశారు. ఆ రంగంలో ఆయన సాధించిన అనితర సాధ్యమైన విజయాలు ఎంతో మంది యువ జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలిచాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.

శ్రీ సిటీ ఎండీ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి


ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తి

తెలుగు భాషాభివృద్ధికి రామోజీరావు చేసిన కృషి నాకు స్ఫూర్తిదాయకం. మా కంపెనీ పేరు తెలుగులో పెట్టడానికి కారణం ఆయనే. కొంత కాలం కిందట ఆయన్ను కలిశా. మాది చిన్న కంపెనీ సర్‌ అన్నపుడు.. ఏది చిన్నది.. ఏది పెద్దది అన్నది కాలం నిర్ణయిస్తుందన్నారు. నాలాంటి ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆయనే స్ఫూర్తిప్రదాత.

కేక హెచ్‌ఆర్‌ వ్యవస్థాపకుడు
విజయ్‌ యలమంచిలి


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని