పసిడి దిద్దుబాటు!

పసిడి ఆగస్టు కాంట్రాక్టుకు ఈవారం రూ.71,256 దిగువన లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండాలి. రూ.70,503 కంటే దిగువన ట్రేడయితే రూ.70,048; రూ.69,655 వరకు దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంది.

Published : 10 Jun 2024 02:04 IST

కమొడిటీస్‌
ఈ వారం

పసిడి

పసిడి ఆగస్టు కాంట్రాక్టుకు ఈవారం రూ.71,256 దిగువన లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండాలి. రూ.70,503 కంటే దిగువన ట్రేడయితే రూ.70,048; రూ.69,655 వరకు దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,847 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే రూ.74,343; రూ.75,191 వరకు రాణించే అవకాశం ఉంది.


వెండి

వెండి జులై కాంట్రాక్టు ఈవారం రూ.92,756 కంటే ఎగువన కదలాడకుంటే కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ స్థాయికి పైన చలిస్తే రూ.96,624 స్థాయి వరకు వెళ్లొచ్చు. అదేవిధంగా రూ.86,873 కంటే దిగువన ట్రేడయితే రూ.84,858 వరకు దిద్దుబాటు కావచ్చు. కొత్తగా పొజిషన్లు తీసుకోవడానికి ముందు అమెరికా ఫెడ్‌ వ్యాఖ్యలనూ ట్రేడర్లు పరిగణనలోకి తీసుకోవాలి.


ప్రాథమిక లోహాలు

  • రాగి జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.874.35 కంటే ఎగువన చలించకుంటే కొంత దిద్దుబాటుకు ఆస్కారం ఉంది. అందువల్ల షార్ట్‌ సెల్లింగ్‌ పొజిషన్లను అట్టేపెట్టుకోవడం మేలు. ఒకవేళ ఈ స్థాయికి పైన చలిస్తే రూ.895.05 వరకు వెళ్తుందని భావించవచ్చు.
  • సీసం జూన్‌ కాంట్రాక్టు ఈవారం ప్రతికూల ధోరణి చలిస్తే రూ.185.90 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.183.80కు దిగివచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రూ.191.70 కంటే పైన కదలాడితే రూ.195.05 వరకు పెరగొచ్చు. 
  • జింక్‌ జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.248 కంటే దిగువన చలిస్తే.. మరింతగా నష్టపోవచ్చు. రూ.261.20 స్థాయికి పైన కదలాడితే రూ.271.90 వరకు రాణించే అవకాశం ఉంటుంది.
  • అల్యూమినియం జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.229 వరకు పడే అవకాశం ఉంది. అందువల్ల రూ.238.65 వద్ద స్టాప్‌లాస్‌ను పరిగణిస్తూ షార్ట్‌ సెల్‌ పొజిషన్లు అట్టేపెట్టుకోవడం మంచిదే.

ఇంధన రంగం

  • ముడి చమురు జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.6,483 కంటే పైన కదలాడితే రూ.6,646; రూ.6,851 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రూ.6,115 కంటే దిగువన చలిస్తే రూ.5,910; రూ.5,747 వరకు దిద్దుబాటు కావచ్చు. 
  • సహజవాయువు జూన్‌ కాంట్రాక్టును ఈవారం రూ.238 దిగువన మాత్రమే షార్ట్‌ సెల్‌ చేయాలి. ఈ స్థాయికి ఎగువన సానుకూల ధోరణికి ఆస్కారం ఉండటమే ఇందుకు కారణం. 

వ్యవసాయ ఉత్పత్తులు

  • పసుపు జూన్‌ కాంట్రాక్టుకు ఈవారం రూ.16,839 దిగువన ప్రతికూల ధోరణికి అవకాశం ఉంది. అయితే రూ.16,454 దిగువన మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.15,598; రూ.14,828 వరకు దిద్దుబాటు కావచ్చు. అదేవిధంగా రూ.18,080 ఎగువకు వెళ్తే రూ.28,850 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. 
  • పత్తి క్యాండీ జూన్‌ కాంట్రాక్టుకు ఈవారం రూ.56,326 వద్ద మద్దతు కనిపిస్తోంది. దీనిని కోల్పోతే రూ.55,813 వరకు పడిపోవచ్చు. అదేవిధంగా రూ.57,326 కంటే పైన చలిస్తే రూ.57,813 వరకు రాణించే అవకాశం ఉంది.

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని