నోకియా 4జీ ఫోన్‌ 3210

నోకియా సంస్థ తన ఉత్పత్తుల్లో ప్రాచుర్యం పొందిన 3210 మోడల్‌ ఫోన్‌ను 4జీ నెట్‌వర్క్‌పై పనిచేసేలా డ్యూయల్‌సిమ్‌తో విడుదల చేసింది.

Published : 11 Jun 2024 01:50 IST

హైదరాబాద్‌: నోకియా సంస్థ తన ఉత్పత్తుల్లో ప్రాచుర్యం పొందిన 3210 మోడల్‌ ఫోన్‌ను 4జీ నెట్‌వర్క్‌పై పనిచేసేలా డ్యూయల్‌సిమ్‌తో విడుదల చేసింది. పాతికేళ్ల క్రితం ఈ మోడల్‌కు అమిత ఆదారణ ఉండేది. తాజా మోడల్‌లో 2.4 అంగుళాల తెర, క్లాసిక్‌ క్యీప్యాడ్, యూపీఐ లావాదేవీలు నిర్వహించుకునేందుకు, యూట్యూబ్‌ వంటి ప్రీ ఇన్‌స్టాల్డ్‌ యాప్స్, వైర్‌లెస్‌ ఎఫ్‌ఎం రేడియో, ఎంపీ3 ప్లేయర్, స్నేక్‌గేమ్‌ అమర్చారు. 32 జీబీ వరకు మెమొరీ కార్డును వేసుకునే వీలున్న ఈ ఫోన్‌ను ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 9.8 గంటల వరకు మాట్లాడుకునే వీలుండటం ప్రధాన ఆకర్షణగా కంపెనీ చెబుతోంది. అమెజాన్, హెచ్‌ఎండీ ఇస్టోర్‌లో రూ.3,999కి విక్రయిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు