‘మేడ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పొడియాట్రీ’లో కిమ్స్‌ హాస్పిటల్స్‌కు 51% వాటా

వాస్క్యులర్‌ సర్జరీలో దశాబ్దకాలానికి పైగా అనుభవం ఉన్న డాక్టర్‌ మేడ ఇటీవల నెలకొల్పిన మేడ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పొడియాట్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే వైద్య సేవల సంస్థలో 51% వాటాను కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) సొంతం చేసుకుంది.

Published : 12 Jun 2024 02:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: వాస్క్యులర్‌ సర్జరీలో దశాబ్దకాలానికి పైగా అనుభవం ఉన్న డాక్టర్‌ మేడ ఇటీవల నెలకొల్పిన మేడ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పొడియాట్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే వైద్య సేవల సంస్థలో 51% వాటాను కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) సొంతం చేసుకుంది. ఈ సంస్థలో రూ.1.02 కోట్లు పెట్టుబడి పెట్టి, ఒక్కొక్కటీ రూ.10 ముఖ విలువ గల 10.20 లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసినట్లు కిమ్స్‌ హాస్పిటల్స్‌ మంగళవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. మేడ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పొడియాట్రీ 9 పడకలతో ఒక ఆసుపత్రిని త్వరలో ప్రారంభించే యత్నాల్లో ఉంది. తదుపరి దీన్ని 20 పడకలకు విస్తరిస్తారు. ఈ సంస్థలో పెట్టుబడి పెట్టడం ద్వారా హైదరాబాద్‌లో నాణ్యమైన పొడియాట్రీ కేర్‌ (పాదాలకు పగుళ్లు, వాపులు రావటం..సంబంధిత ఇతర ఇబ్బందులకు చికిత్స) ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఏర్పడుతున్నట్లు కిమ్స్‌ హాస్పిటల్స్‌ వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని