రూ.7.7 కోట్లు సమీకరించిన వీహౌస్‌

ఇంటి నిర్మాణంలో అవసరమైన అన్ని రకాల సేవలనూ అందించే టెక్‌ ఆధారిత నిర్మాణ అగ్రిగేటర్‌ వీహౌస్‌ (గతంలో హోకోమోకో) రూ.7.7 కోట్ల (1 మిలియన్‌ డాలర్లు) నిధులను సమీకరించింది.

Published : 17 May 2022 05:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటి నిర్మాణంలో అవసరమైన అన్ని రకాల సేవలనూ అందించే టెక్‌ ఆధారిత నిర్మాణ అగ్రిగేటర్‌ వీహౌస్‌ (గతంలో హోకోమోకో) రూ.7.7 కోట్ల (1 మిలియన్‌ డాలర్లు) నిధులను సమీకరించింది. సిరీస్‌ ఎ ఫండింగ్‌లో భాగంగా ఈ మొత్తం ఆంథిల్‌ వెంచర్స్‌ నుంచి అందుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీపాద్‌ నందిరాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ ఇంటి నిర్మాణదారులకు అవసరమైన అనుమతులు, ఆర్కిటెక్చర్‌, ఇంటీరియర్స్‌తో పాటు, పర్యవేక్షణ సేవలను అందిస్తుంది. ఇంటి నిర్మాణ పనులు, నిర్మాణ సామగ్రి వినియోగంలాంటివి వీడియోలు, ఫొటోల ద్వారా పర్యవేక్షించే ఏర్పాటు చేస్తుంది. సంస్థను సాంకేతికంగా మరింత మెరుగుపర్చేందుకు, విస్తరణ కోసం ఈ నిధులను వినియోగిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని