స్టార్టప్‌లు నేర్పిన పాఠాలివే: గజల్‌ అలఘ్‌

Ghazal Alagh: తరచూ ఆసక్తి రేకెత్తించే పోస్టులు చేస్తుంటారు మామా ఎర్త్ సహ-వ్యవస్థాపకురాలు గజల్‌ అలఘ్‌. స్టార్టప్‌ల వల్ల తాను నేర్చుకున్న పాఠాలను తాజాగా ‘‘ఎక్స్‌’’ వేదికగా పంచుకున్నారు.

Updated : 02 Jun 2024 16:48 IST

Ghazal Alagh | ఇంటర్నెట్‌డెస్క్‌: వ్యాపార రంగంలో రాణించడం అంటే సాధారణ విషయం కాదు. ఎన్నో సవాళ్లను స్వీకరిస్తూ, ఆటుపోట్లను దాటుకుంటూ ముందుకు వెళ్లాలి. చాలా మంది సొంత ఆలోచనలతో స్టార్టప్‌లు (startups) మొదలు పెట్టి ఆ సంస్థను విజయవంతమైన మార్గంలో నడిపిస్తున్నారు. అలాంటి వాళ్లలో బ్యూటీ బ్రాండ్ మామాఎర్త్‌ (Mamaearth) సహ-వ్యవస్థాపకురాలు గజల్ అలఘ్‌ (Ghazal Alagh) కూడా ఒకరు. తరచూ సోషల్‌మీడియా వేదికగా తన ఆలోచనల్ని, అభిప్రాయాల్ని, టిప్స్‌ను పంచుకునే ఆమె.. తాజాగా స్టార్టప్‌ల వల్ల తాను నేర్చుకున్న విలువైన పాఠాలను ‘‘ఎక్స్‌’’ వేదికగా షేర్‌ చేశారు.

ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ.. అంబానీని వెనక్కి నెట్టి తొలిస్థానానికి

  • విజయం.. మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే స్ఫూర్తి నింపుతుంది. అనుకున్నది సాధించిన తర్వాత అక్కడే ఆగిపోకండి.
  • మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం స్వార్థం కాదు. శ్రద్ధ తీసుకోవడం అనేది మీకు, మీ వ్యాపారానికి మంచిది.
  • సపోర్ట్‌ చేసే వ్యక్తుల మధ్య ఉంటే.. మీరు, మీ వ్యాపారం ముందుకెళ్లడానికి సహకారంగా ఉంటుంది.
  • లాంగ్‌- టర్మ్‌ ప్లాన్లు ఉండటం చాలా గొప్ప విషయం. అయితే దాని కోసం తీసుకునే తర్వాత అడుగుపై దృష్టి పెట్టడం మర్చిపోకూడదు.
  • చమత్కారాలను అంగీకరించండి.. ఈ విలక్షణ స్వభావం మీకు ప్రత్యేక గుర్తింపు తెస్తుంది.
  • జీవితమంతా పనిలోనే నిమగ్నమైపోవద్దు. ప్రతి తడబాటు అనుకున్నది సాధించడానికి ఒక మెట్టు.

ఈ 6 పాఠాలు నేర్చుకోవడానికి తనకు 10,000+ గంటలు, 7+ సంవత్సరాలు, 3 స్టార్టప్‌ల సమయం పట్టిందన్నారు. అలఘ్‌ పెట్టిన పోస్ట్‌  ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘‘మీరు నేర్చుకున్న పాఠాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు’’, ‘‘అందరికీ ఉపయోగపడే సలహాలు ఇవి’’ అని అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని