Github:గిట్‌హబ్‌లో 142 మందికి ఉద్వాసన
కంపెనీ పునర్వవస్థీకరించటంకోసం ఉద్యోగులను తొలగించినట్లు గిట్‌హబ్ తెలిపింది. భారత్‌లో ఉన్న తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో 142 మందిని తొలగించినట్లు ప్రకటించింది.
దిల్లీ: ఆర్థిక మాంద్యం భయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింత అస్థిరత నెలకొనే అవకాశాలు ఉంటాయనే భయంతో ఇప్పటికే పలు కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి (Layoff). మైక్రోసాప్ట్, యాపిల్, గూగుల్, మెటా, ట్విటర్ వంటి సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించే ప్రక్రియలు మొదలుపెట్టాయి. ఇప్పుడు మైక్రోసాప్ట్ అనుబంధ సంస్థ గిట్‌హబ్ (Github) కూడా ఆ బాటే పట్టింది. భారత్‌లో ఆ సంస్థలో పనిచేసే వారిలో 142 మందిని తొలగించినట్లు ప్రకటించింది.
కంపెనీ పునర్వవస్థీకరించటంకోసం ఫిబ్రవరిలో తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఉద్యోగులను తొలగించినట్లు సంస్థ ఉన్నతాధికారి వెల్లడించారు. దిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్‌లో ఉన్న ఉద్యోగుల్లో 142 మందిని తొలగించినట్లు మంగళవారం ప్రకటించారు. ఉద్యోగులను తీసేయటం కష్టమైనప్పటికీ దీర్ఘకాలంలోపెట్టుబడులు పెట్టగల సామర్థ్యం కోసం ఈ నిర్ణయం తప్పటం లేదన్నారు. 2018 జూన్ 2 న 7.5 బిలియన్ డాలర్లను వెచ్చించి మైక్రోసాఫ్ట్ గిట్‌హబ్‌ని కొనుగోలు చేసింది. మైక్రోసాప్ట్ కూడా 10వేల మందిని ఉద్యోగం నుంచి తొలగించనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన విషయం తెలిసిదే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Kurnool: ఎల్లమ్మా.. నీ వెండి బంగారాలు ఏవమ్మా?
-
Politics News
TDP-Mahanadu: ‘బహిరంగ సభకు అడుగడుగునా అడ్డంకులే’
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Politics News
రూ.2కే కిలో బియ్యం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే: పేర్ని నాని
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు