Godrej my Farm milk: విపణిలోకి గోద్రెజ్‌ మై ఫార్మ్‌ పాలు

తాజా పాలను నేరుగా వ్యవసాయ క్షేత్రం నుంచి ఇంటికి అందించేలా గోద్రెజ్‌ మై ఫార్మ్‌ పాలను గోద్రెజ్‌ అగ్రోవెట్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ క్రీమ్‌లైన్‌ డైరీ ప్రొడక్ట్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది.

Published : 31 May 2024 03:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: తాజా పాలను నేరుగా వ్యవసాయ క్షేత్రం నుంచి ఇంటికి అందించేలా గోద్రెజ్‌ మై ఫార్మ్‌ పాలను గోద్రెజ్‌ అగ్రోవెట్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ క్రీమ్‌లైన్‌ డైరీ ప్రొడక్ట్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. అధునాతన సాంకేతికతతో, ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా ఈ పాలను సేకరించడంతో పాటు, ప్యాకింగ్‌ చేస్తామని గోద్రెజ్‌ జెర్సీ సీఈఓ భూపేంద్ర సూరి గురువారం ఇక్కడ తెలిపారు. సహజసిద్ధ రుచి, పోషకాలను ఏ మాత్రం కోల్పోకుండా ఈ పాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్‌లోనే ఈ పాలు లభిస్తాయని తెలిపారు. 70కి పైగా స్టోర్లతో పాటు, క్విక్‌ కామర్స్‌ సంస్థల ద్వారా కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. అర లీటరు ప్యాకెట్‌ ధర రూ.50గా నిర్ణయించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని