Gold Rate: కొత్త గరిష్ఠాలకు పసిడి

పసిడి ధరల జోరు కొనసాగుతోంది. బుధవారం రాత్రి 11.30కు స్థానిక మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం(99.9 స్వచ్ఛత) ధర జీవనకాల గరిష్ఠమైన రూ.72,250కు చేరింది.

Updated : 04 Apr 2024 08:38 IST

హైదరాబాద్‌: పసిడి ధరల జోరు కొనసాగుతోంది. బుధవారం రాత్రి 11.30కు స్థానిక మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం(99.9 స్వచ్ఛత) ధర జీవనకాల గరిష్ఠమైన రూ.72,250కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరల ర్యాలీ ఇందుకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. ఈ వారంలో పసిడి జీవనకాల గరిష్ఠాలను తాకడం ఇది రెండోసారి. కేజీ వెండి కూడా భారీగా పెరిగి రూ.81,194 వద్ద ట్రేడవుతోంది.

  • అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌ (31.10 గ్రాములు) 2,295 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ప్రారంభ ట్రేడింగ్‌లో ఇది 2300 డాలర్లను తాకింది. వెండి ఔన్స్‌ ధర 25.55 డాలర్ల నుంచి 27.05 డాలర్లకు పరుగులు తీసింది.
  • అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల కోతలకు సంకేతాలివ్వడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పసిడికి గిరాకీ పెరిగింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని