Gold price: రికార్డు గరిష్ఠానికి బంగారం.. 10 గ్రాములు రూ.70 వేలు పైనే!

Gold rate: బంగారం ధర రికార్డు గరిష్ఠానికి చేరింది. 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.70వేలు పైనే పలుకుతోంది.

Published : 01 Apr 2024 17:44 IST

Gold price | దిల్లీ: బంగారం ధర మళ్లీ పెరిగింది. పసిడి ధర (Gold price) సరికొత్త గరిష్ఠాలకు చేరింది. బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 క్యారెట్లు) ధర సోమవారం సాయంత్రం నాటికి రూ.70,978 (పన్నులతో కలిపి) పలుకుతోంది. అంతక్రితం రోజుతో పోలిస్తే రూ.వెయ్యికి పైగా  పెరగడం గమనార్హం. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్‌ పెరగడంతో దేశీయంగానూ ధరలు పెరుతున్నాయి. వెండి సైతం కిలో రూ.1,120 మేర పెరిగి రూ.78,570కి చేరింది.

36 కోట్ల పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు.. స్వస్తి పలకడం సాధ్యమే!

ఇటీవల అమెరికాలో వెలువడిన ద్రవ్యోల్బణ గణాంకాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. దీంతో జూన్‌ నుంచి వడ్డీ రేట్లు తగ్గించొచ్చన్న అంచనాలు బలపడ్డాయి. పసిడికి గిరాకీ బాగుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో సీనియర్‌ అనలిస్ట్‌ దిలీప్‌ పర్మార్‌ తెలిపారు. దీనికితోడు చైనా నుంచి డిమాండ్‌ పెరగడమూ మరో కారణమన్నారు. అంతర్జాతీయ విపణిలో స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌ (31.10 గ్రాములు) 2,265.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. త్వరలో పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ సహా అమెరికా నుంచి వెలువడాల్సిన కీలక గణాంకాలు ఫెడరల్‌ రిజర్వ్‌ పరపతి విధాన నిర్ణయాలను నిర్దేశించొచ్చని బీఎన్‌పీ పారిబాస్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌సింగ్‌ తెలిపారు.

గమనిక: ప్రాంతాన్ని బట్టి బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. వాస్తవ ధర కోసం దగ్గర్లోని బంగారం దుకాణదారుడిని సంప్రదించగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని