Google layoffs: గూగుల్‌లో మరిన్ని తొలగింపులు..?

Google layoffs: గూగుల్‌లో ఈ ఏడాది మరిన్ని తొలగింపులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే అడ్వర్టైజ్‌మెంట్‌, యూట్యూబ్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌లో పనిచేసే ఉద్యోగులను గూగుల్‌ సాగనంపింది.

Published : 18 Jan 2024 18:52 IST

Google layoffs | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ (Google layoffs) మరిన్ని ఉద్యోగాల తొలగింపులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2024 తొలి వారంలో వివిధ విభాగాల్లో ఉద్యోగులను తొలగించిన గూగుల్‌.. ఈ ఏడాదిలో  మరికొంతమంది ఉద్యోగులను కూడా సాగనంపాలని చూస్తోంది. ఇదే విషయాన్ని ఉద్యోగులకు అంతర్గత మెమో ద్వారా సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తెలియజేసినట్లు ‘ది వెర్జ్‌’ వెబ్‌సైట్‌ పేర్కొంది.

ఈ ఏడాది ప్రాధాన్యమైన అంశాల్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని, ఇందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పిచాయ్‌ పేర్కొన్నట్లు తెలిసింది. కొన్ని విభాగాల్లో నిర్వహణ ప్రక్రియను సులభతరం, వేగవంతం చేసేందుకు కొన్ని లేయర్లను తొలగించాల్సిన అవసరం ఉందని, గతేడాది మాదిరిగా భారీ స్థాయిలో తొలగింపులు మాత్రం ఉండబోవని అన్నట్లు సమాచారం. అన్ని విభాగాలనూ టచ్‌ చేయబోమని చెప్పినట్లు తెలిసింది.

EPFO కీలక నిర్ణయం.. ఆ జాబితా నుంచి ఆధార్‌ తొలగింపు

గతేడాది గూగుల్‌ 12వేల మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. గూగుల్‌ చరిత్రలో ఈ స్థాయిలో తొలగింపులు చేపట్టడం అదే తొలిసారి. ఈ ఏడాది సైతం కొన్ని తొలగింపులు చేపట్టింది. యూట్యూబ్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌లో వందమంది ఉద్యోగులను తొలగించింది. యూట్యూబ్‌ ఆపరేషన్స్‌, క్రియేటర్‌ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఈ తొలగింపులు చేపట్టింది. అడ్వర్టైజ్‌మెంట్ సేల్స్‌ టీమ్‌లో వెయ్యి మందికి గూగుల్‌ పింక్‌ స్లిప్పులు ఇచ్చింది. వారికి పరిహార ప్యాకేజీని అందిస్తామని, ఇతర విభాగాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని