Tech tip: ఒక్క ఫొటోతో లెక్కల చిక్కులకు పరిష్కారం!

Tech tip: గణితం నేర్చుకోవడంలో సాయపడుతూ, అందులోని ప్రశ్నలకు సులువుగా సమాధానం అందించేందుకు వీలుగా గూగుల్‌ కొత్త యాప్‌ని తీసుకొచ్చింది. దాన్ని ఎలా వినియోగించాలంటే?

Published : 04 Mar 2024 11:08 IST

Tech tip | ఇంటర్నెట్‌డెస్క్‌: గణితం పేరు వింటేనే చాలామందికి భయం. ఆ లెక్కల చిక్కుముడులు విప్పడం కొంచెం కష్టమే మరి. కొన్ని గణిత సమస్యలకు సమాధానం రాబట్టడానికి కొందరు తెగ కష్టపడుతుంటారు. అలాంటి వారికి గూగుల్‌ ఇకపై సాయపడనుంది. అదెలాగంటారా? ఫొటో మ్యాథ్‌ యాప్‌ ద్వారా. గతంలో గూగుల్‌ దీన్ని కొనుగోలు చేసింది. తాజాగా ఈ యాప్‌ను ప్లేస్టోర్‌, యాప్‌ స్టోర్‌లో యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

గణితంలో ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకపోతే ఈ యాప్‌ పరిష్కారం చూపుతుంది. ప్రశ్నను ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే చాలు వెంటనే సమాధానం ఇస్తుంది. రేఖా గణితం, త్రికోణమితి, కూడికలు, తీసివేతలు సహా ఏ గణిత ప్రశ్నలకైనా ఇది జవాబులు అందిస్తుంది. యూజర్లు అర్థం చేసుకొనేందుకు వివిధ భాషలకు సపోర్ట్ చేస్తుంది. దీన్ని వినియోగించడానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అదనపు ఫీచర్లు కావాలంటే మాత్రం డబ్బులు చెల్లించి ‘ఫొటో మ్యాథ్‌ ప్లస్‌’ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

ఎలా వినియోగించాలంటే..?

  •  ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ స్టోర్‌లో Photomath అని సెర్చ్‌ చేసి యాప్‌ని డౌన్‌లోడ్‌ చేయండి.
  •  యాప్‌ ఓపెన్‌ చేసి స్కానర్‌ సాయంతో ప్రశ్నను క్యాప్చర్‌ చేయండి.
  •  ఒకవేళ స్కానింగ్‌ చేయడానికి సాధ్యం కాకపోతే ప్రశ్నను మాన్యువల్‌గా టైప్‌ చేయొచ్చు. దీనికోసం ప్రత్యేక కీ బోర్డ్‌ ఉంటుంది.
  •  ప్రాబ్లమ్‌ని స్కాన్‌ చేయగానే సులువుగా అర్థమయ్యేలా సమాధానం స్క్రీన్‌పై కనిపిస్తుంది. 

గమనిక: చేతి రాతలో స్పష్టత ఉన్నప్పుడు మాత్రమే ప్రశ్నలను గుర్తించి, కచ్చితమైన ఫలితాలను ఇస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని