ఫ్లిప్‌కార్ట్‌లో వాటాను కొనుగోలు చేయనున్న గూగుల్‌

ఫ్లిప్‌కార్ట్‌లో మైనారిటీ వాటాను గూగుల్‌ కొనుగోలు చేయనుందని వాల్‌మార్ట్ గ్రూప్‌ శుక్రవారం తెలిపింది.

Published : 24 May 2024 20:54 IST

దిల్లీ: ప్రమఖ టెక్‌ కంపెనీ గూగుల్‌ (Google).. ఈ- కామర్స్ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. తాజా ఫండింగ్‌ రౌండ్‌లో భాగంగా మైనారిటీ వాటా కొనుగోలుకు ప్రతిపాదించినట్లు వాల్‌మార్ట్‌ గ్రూప్‌ శుక్రవారం తెలిపింది. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి మైనారిటీ పెట్టుబడిదారుగా గూగుల్‌ను చేర్చుకోనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ ఈరోజు వెల్లడించింది. అయితే, గూగుల్‌ ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తుందనే విషయాన్ని మాత్రం ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించలేదు. గూగుల్‌ పెట్టుబడులు, దాని క్లౌడ్‌ సహకారం మా వ్యాపారాన్ని విస్తరించడం, దేశవ్యాప్తంగా మరింతమంది వినియోగదారులకు సేవలు అందించడంతో పాటు డిజిటల్‌ మౌలిక సదుపాయాలు ఆధునికీకరించడంలో సాయపడతాయని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు