IDBI ప్రైవేటీకరణ షురూ.. 60 శాతం వాటా విక్రయానికి బిడ్లు

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఐడీబీఐ ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం తాజాగా ఇన్వెస్టర్ల నుంచి బిడ్లు ఆహ్వానించింది.

Published : 07 Oct 2022 19:33 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఐడీబీఐ (IDBI Bank) ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 60.72 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం తాజాగా ఇన్వెస్టర్ల నుంచి బిడ్లు ఆహ్వానించింది. బిడ్లు లేదా ఆసక్తి వ్యక్తీరణకు డిసెంబర్‌ 16ను తుది గడువుగా పేర్కొంది.

ఐడీబీఐలో ఎల్‌ఐసీకి ప్రస్తుతం 49.24 శాతం వాటాకు సమానమైన 529.41 కోట్ల షేర్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి 45.48 శాతం వాటాకు సమానమైన 488.99 కోట్ల షేర్లున్నాయి. ప్రైవేటీకరణలో భాగంగా 30.48 శాతం ఎల్‌ఐసీ వాటా, 30.24 ప్రభుత్వ వాటాలను విక్రయించనున్నారు. యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేపట్టనున్నారు. బీఎస్‌ఈలో ఐడీబీఐ షేరు విలువ శుక్రవారం 42.70 వద్ద ముగిసింది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం వాటాల విక్రయం ద్వారా రూ.27,800 కోట్లు సమకూరనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని