GST on RERA: ‘రెరా’పై జీఎస్‌టీ మినహాయింపు.. త్వరలో క్లారిటీ!

GST on RERA: సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి రావడానికి ముందే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జీఎస్‌టీ మండలి సమావేశం జరిగే అవకాశం ఉంది.

Published : 25 Feb 2024 16:49 IST

దిల్లీ: స్థిరాస్థి నియంత్రణ సంస్థ (RERA) వస్తు సేవల పన్ను (GST) చెల్లించాల్సిన అవసరం లేదనే అంశంపై జీఎస్‌టీ  మండలి త్వరలో స్పష్టతనిస్తుందని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు. రెరా పనితీరును సమీక్షించిన తర్వాత వారికి జీఎస్‌టీ వర్తించదనే నిర్ధరణకు వచ్చినట్లు పేర్కొన్నారు. మరోవైపు ‘రెరా’లకు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తున్నాయని గుర్తుచేశారు. వీటిపై జీఎస్‌టీ వేస్తే అది రాష్ట్ర ప్రభుత్వాలపై పన్ను విధించినట్లు అవుతుందని వివరించారు.

సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి రావడానికి ముందే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జీఎస్‌టీ మండలి (GST Council) సమావేశం జరిగే అవకాశం ఉంది. 2023 అక్టోబర్‌ 7న చివరి భేటీ జరిగింది. 2022 జులై 18కి ముందు ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏ, జీఎస్‌టీ నెట్‌వర్క్‌, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వంటి నియంత్రణ సంస్థలు అందించే సేవలకు జీఎస్‌టీ వర్తించేది కాదని మూర్‌ సింఘీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రజత్‌ మోహన్‌ వెల్లడించారు. తర్వాత దాన్ని వెత్తివేయడంతో రెరా వంటి వాటిపై దాని ప్రభావం గురించి చర్చ మొదలైంది.

‘‘రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC)కి అనుమతి లేదు. అంటే రెరాను జీఎస్‌టీ నుంచి మినహాయించడం వల్ల డెవలపర్లు, గృహ కొనుగోలుదారులకు ఖర్చులు తగ్గుతాయి. ఈ విషయంపై జీఎస్‌టీ మండలి సానుకూల నిర్ణయం స్థిరాస్తి రంగానికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది’’ అని మోహన్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని