Viral news: నీ తండ్రి స్థాయేంటో తెలుసా అన్నారు : జొమాటో సీఈఓ

జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తాను స్టార్టప్ ప్రారంభించాలనుకున్న తొలి రోజుల గురించి గుర్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 21 May 2024 17:11 IST

దిల్లీ: ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ జొమాటోను స్థాపించడంలో తన అనుభవాలను పంచుకున్నారు.

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ (Hardeep Singh Puri) నిర్వహించిన విశేష్ సంపర్క్ కార్యక్రమంలో జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) పాల్గొని ప్రసంగించారు.  స్టార్టప్‌ను ప్రారంభించాలని ఆలోచన వచ్చిన వెంటనే తన తండ్రితో ఆ విషయంపై చర్చించానని తెలిపారు. అది సాధ్యం కాని విషయమని, మనం చేయలేమని ఆయన అన్నారని గుర్తు చేసుకున్నారు. ‘‘స్టార్టప్‌ ప్రారంభిస్తానని నాన్నకు చెప్పినప్పుడు ఆయన నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. ఇంత చిన్న ఊరిలో ఉన్న మనం ఏమీ చేయలేమని, అది సాధ్యం కాని పని అని అనుమానం వ్యక్తంచేశారు’’ అని పేర్కొన్నారు. కాని ప్రభుత్వ సహకారంతో నాలాంటి చిన్న పట్టణానికి చెందిన కుర్రాడు కూడా జొమాటో వంటి సంస్థను స్థాపించగలడని నిరూపించానని తెలిపారు. 2008లో సంస్థను స్థాపించినప్పటినుంచి నేటివరకు సంస్థ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని ఆనందం వ్యక్తంచేశారు. గోయల్ ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

కొన్ని నెలల క్రితం గోయల్ మోడల్ గ్రీసియా మునోజ్‌ (Grecia Munoz)ను వివాహం చేసుకున్నారు. కటిక పేదరికం నుంచి లక్షల మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన అతడి జీవన ప్రయాణం ఎందరో యువతకు స్ఫూర్తివంతంగా నిలుస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు