Hero MotoCorp: హీరోమోటోకార్ప్‌ నుంచి ఈ ఏడాది రికార్డు స్థాయిలో కొత్త బైక్‌లు

Hero MotoCorp: ఈ ఆర్థిక సంవత్సరం ప్రీమియం సెగ్మెంట్‌లో చాలా బైక్‌లను లాంఛ్‌ చేస్తామని హీరోమోటోకార్ప్‌ తెలిపింది.

Published : 14 May 2023 16:33 IST

దిల్లీ: కంపెనీ చరిత్రలోనే ఈ ఆర్థిక సంవత్సరం అత్యధిక కొత్త బైక్‌లను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నామని హీరోమోటోకార్ప్‌ (Hero MotoCorp) సీఈఓ నిరంజన్‌ గుప్తా తెలిపారు. తద్వారా ప్రీమియం బైక్‌ సెగ్మెంట్‌లో పట్టు సాధిస్తామని తెలిపారు. హీరోమోటోకార్ప్‌- హార్లీ డేవిడ్‌సన్‌ (Harley Davidson) భాగస్వామ్యంలో తొలి బైక్‌ను కూడా ఈ ఏడాదే మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. 

ప్రస్తుతం బడ్జెట్‌ బైక్‌ సెగ్మెంట్‌ (100- 110సీసీ)లో హీరోమోటోకార్ప్‌ (Hero MotoCorp)కు పెద్దవాటా ఉంది. 125 సీసీ విభాగంలోనూ మార్కెట్‌ వాటా పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 160 సీసీ సెగ్మెంట్‌పైనా గురి పెట్టింది. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రతి త్రైమాసికంలో కొత్త బైక్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తామని గుప్తా తెలిపారు. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్‌లో చాలా బైక్‌లను లాంఛ్‌ చేస్తామన్నారు. 150 సీసీ నుంచి 450 సీసీ మధ్యశ్రేణిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు వెల్లడించారు. మార్కెట్‌ వాటా, మార్జిన్లపరంగా ఈ ఏడాది గణనీయ వృద్ధిని నమోదు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

విడా (VIDA) బ్రాండ్‌తో హీరోమోటోకార్ప్‌ ఈవీ సెగ్మెంట్‌ (EV business)లోకీ ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 100 నగరాలకు తమ డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థను విస్తరించాలని నిర్ణయించింది. ఈ విషయంలో హీరోకు ఉన్న బలమైన నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటామని గుప్తా తాజాగా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని