రిక్రూట్‌మెంట్‌లోనూ ఏఐ హవా.. రెజ్యూమె పరిశీలన, ఇంటర్వ్యూల్లోనూ సాయం!

రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలోనూ ఏఐ తన సత్తా చాటుతోంది. రెజ్యూమెలను ఫిల్టర్‌ చేయడంలో సంస్థలకు సాయం చేస్తోంది.

Published : 27 May 2024 00:08 IST

AI | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. ప్రతి రంగంలోనూ దీని హవా వేగంగా విస్తరిస్తోంది. కేవలం కంపెనీలో పని చేసే ఉద్యోగులకే కాదు అభ్యర్థులను నియమించుకోవడంలో కూడా ఈ సాంకేతికతే సాయం చేస్తోంది. రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ను వేగవంతం చేయడంలో కృత్రిమ మేధ తన సత్తా చాటుతోంది.

సాధారణంగా కంపెనీలకు దరఖాస్తు చేసుకోవాలంటే రెజ్యూమెలు పంపుతారు. వాటిని క్షుణ్నంగా సమీక్షించి అందులోని స్కిల్స్‌ని ఫిల్టర్‌ చేసి సరైన అభ్యర్థులను ఎంచుకుంటారు. ఇలా ఇంటర్వ్యూకంటే ముందు జరిగే ప్రాసెస్‌ను మనుషుల ప్రమేయం లేకుండా జరిపేందుకు చాలా సంస్థలు ఏఐనే ఉపయోగిస్తున్నాయి.  ఏకపక్షంగా వ్యవహరించడాన్ని తగ్గిస్తూ అభ్యర్థుల ఎంపికను సులభతరం చేస్తోందని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా ముఖాముఖిని మాత్రమే వ్యక్తులు నిర్వహిస్తున్నారు. మరి కొన్ని సంస్థల్లో GenAI చాట్‌బాట్‌లు మేనేజర్‌లకు ఇంటర్వ్యూలు నిర్వహించడంలోనూ సాయపడుతున్నాయి. డేటా గోప్యత, అభ్యర్థుల్లోని సమర్థతను పరీక్షించడంలో పరిమితులు ఉన్నప్పటికీ ఏఐ ద్వారానే నియామక ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతోందని కొందరు హెచ్‌ఆర్‌ రిక్రూటర్‌లు చెబుతున్నారు.

జూన్ 14 తర్వాత ఆ ఆధార్‌ కార్డులు పనిచేయవా? ఉడాయ్‌ వివరణ..

రెజ్యూమెను పరిశీలించి కావాల్సిన ఉద్యోగానికి అర్హత ఉందో.. లేదో.. చెప్పగలిగే జెన్‌ఏఐ ఆధారిత ఐమ్యాచ్‌ టూల్‌ను వాడుతున్నట్లు జెన్‌ప్యాక్ట్‌ ఇటీవల వెల్లడించింది. కొత్త నియామకాల్లో 40 శాతం అలాగే చేపట్టామని తెలిపింది. ఇంటర్వ్యూ మాత్రం వ్యక్తులే నిర్వహించినట్లు పేర్కొంది. దీంతో అభ్యర్థుల ఎంపిక మరింత వేగవంతమైందని కంపెనీ గ్లోబల్‌ హైరింగ్‌ లీడర్‌ తెలిపారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సంస్థ వెల్స్పన్ ఎంటర్‌ప్రైజెస్ కూడా ఇంటర్వ్యూలు తీసుకోవడంలో సహాయపడే GenAI బాట్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు