QR code scams: క్యూఆర్‌ కోడ్‌ స్కామ్‌లతో జాగ్రత్త!

QR code scams: తరచూ క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌ చేసి లావాదేవీలు జరుపుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి.

Published : 07 Dec 2023 02:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ డిజిటల్ యుగంలో దాదాపు లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతున్నాయి. చిన్న వస్తువుల కొనుగోళ్ల దగ్గర నుంచి ఇంటికి తీసుకొచ్చే డెలివరీ పార్శిల్స్‌ వరకు అన్నింటికీ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా స్కాన్‌ చేసి డబ్బులు చెల్లిస్తున్నాం. దీంతో నకిలీ క్యూఆర్‌ కోడ్‌ స్కానర్లు పెరిగిపోయాయి. వీటిపై అవగాహన లేకపోవటంతో చాలా మంది తమ సొమ్మును పోగొట్టుకుంటున్నారు.

క్యూఆర్‌ ద్వారా లావాదేవీలు నిర్వహించే వారినే లక్ష్యంగా చేసుకొని కేటుగాళ్లు కొత్త తరహా మోసాలు తెరతీస్తున్నారు. ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో నకిలీ క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేసి స్కాన్‌ చేస్తే డబ్బులు వస్తాయంటూ మాయమాటలు చెప్పి డబ్బులు దోచుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. మీరు కూడా తరచూ స్కాన్‌ చేసి డబ్బులు చెల్లిస్తున్నారా? అయితే ఇలాంటి స్కామ్‌ బారిన పడకుండా ఉండాలంటే ఏది నిజమైన క్యూఆర్‌ కోడ్‌, ఏది నకిలీదో తెలుసుకోవటం చాలా ముఖ్యం.

వికీపీడియాలో భారత్‌ హవా..!

ఎవరైనా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే రివార్డులు, డబ్బులు వస్తాయంటే అస్సలు నమ్మకండి. ఎందుకంటే క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కేవలం డబ్బు పంపడానికి మాత్రమే వీలవుతుందనే విషయం గుర్తుంచుకోండి. ప్రముఖ కంపెనీ పేర్లతో కూడా నకిలీ క్యూఆర్‌ కోడ్‌లను కేటుగాళ్లు రూపొందిస్తుంటారు. అసలైన కంపెనీకి, దీనికి మధ్య పేరులో కొంచెమైనా వ్యత్యాసం ఉండి ఉంటుంది. అలా నకిలీ క్యూఆర్‌ కోడ్‌ని గుర్తించవచ్చు. అలానే క్యూఆర్‌ స్కామ్‌ల బారిన పడకుండా ఉండాలంటే.. మీ యూపీఐ ఐడీలు, బ్యాంక్‌ వివరాలు గుర్తుతెలియని వ్యక్తులతో పంచుకోకండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని