Electric Vehicles: చెన్నైలో EVలకు హ్యుందాయ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (HMIL) చెన్నైలో తన మొట్టమొదటి ఫాస్ట్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది.

Published : 27 May 2024 18:25 IST

చెన్నై: ప్రముఖ వాహన సంస్థ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (HMIL) సోమవారం చెన్నైలో ఫాస్ట్‌ ఎలక్ట్రిక్‌ పవర్డ్‌ వెహికల్స్‌ (EV) ఛార్జింగ్‌ స్టేషన్‌ను ప్రారంభించింది. త్వరలో తమిళనాడు అంతటా 100 ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు సంస్థ తెలిపింది. 150 KW, 30 KW కనెక్టర్లతో కూడిన 180 KW DC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ ‘స్పెన్సర్‌ ప్లాజా’లో ఏర్పాటు చేసింది. బ్రాండ్‌, మోడల్‌తో సంబంధం లేకుండా అన్ని రకాల కార్లకు ఇక్కడ ఛార్జింగ్‌ సర్వీసు లభిస్తుందని సంస్థ తెలిపింది.

ఎలక్ట్రిక్‌ వాహన యజమానులు myHyundai యాప్‌లో HMIL సొంత ఛార్జర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంలో ఛార్జింగ్‌ సదుపాయాన్ని యాక్సెస్‌ చేయొచ్చు. లొకేషన్‌, నావిగేషన్‌, ఛార్జింగ్‌ స్లాట్‌ల ప్రీ-బుకింగ్‌, డిజిటల్‌ చెల్లింపుల సౌకర్యాలు ఉన్నాయి. ఫాస్ట్‌ పబ్లిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌తో పాటు, ప్రస్తుతం తమిళనాడులో అందుబాటులో ఉన్న 170 కంటే ఎక్కువ ఛార్జింగ్‌ పాయింట్స్‌..వినియోగదారుల సౌలభ్యం కోసం myHyundai యాప్‌లోని ‘EV ఛార్జ్‌’ విభాగంలో మ్యాప్‌ చేశారు. ఇది హ్యుందాయ్‌, నాన్‌ హ్యుందాయ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు