ఐసీఐసీఐ మాజీ ఛైర్మన్‌ వాఘుల్‌ కన్నుమూత

ప్రభుత్వ రంగంలోని ఐసీసీఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నారాయణ్‌ వాఘుల్‌ (88) ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్‌ పరిశ్రమలో ఆయన ప్రస్థానం 1960లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రారంభమైంది.

Published : 19 May 2024 01:54 IST

ముంబయి: ప్రభుత్వ రంగంలోని ఐసీసీఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నారాయణ్‌ వాఘుల్‌ (88) ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్‌ పరిశ్రమలో ఆయన ప్రస్థానం 1960లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రారంభమైంది. 1985 నుంచి ఐసీఐసీఐకి ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా 11 ఏళ్లపాటు సేవలు అందించారు. 2006లో దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌ను అందుకున్నారు. ఆ తర్వాత ఎస్‌బీఐ నుంచి బయటకు వచ్చి, కొన్నాళ్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో బోధించారు. 1981లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయ్యారు. అప్పుడు ఆయన వయసు 44. ప్రభుత్వ యాజమాన్యంలోని ఒక బ్యాంకుకు చిన్న వయసులోనే సీఎండీగా పనిచేయడం విశేషం. ఆ తర్వాత ఐసీఐసీఐ సీఎండీగా నియమితులయ్యారు. సంస్థను ప్రైవేటు రంగ బ్యాంకుగా మార్చడాన్ని పర్యవేక్షించారు. 1996 వరకూ ఐసీఐసీఐకి సీఎండీగా సేవలను అందించారు. ఆ తర్వాత 2009 వరకూ ఐసీఐసీఐ బ్యాంక్‌ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కొనసాగారు. మహీంద్రా అండ్‌ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్‌తో పాటు పలు సంస్థల బోర్డులలో సేవలు అందించారు. హైదరాబాద్‌లో ఐసీఐసీఐ నాలెడ్జ్‌ పార్క్‌ ఏర్పాటులోనూ వాఘుల్‌ కీలక పాత్ర పోషించారు. ఈయన మరణంపై ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని