ICICI Festive Bonanza: ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫెస్టివ్‌ బొనాంజా..రూ.26 వేల వరకు క్యాష్‌బ్యాక్‌!

ICICI Festive Bonanza: పండగ సీజన్‌ నేపథ్యంలో తమ కస్టమర్ల కోసం ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. రాయితీలు, క్యాష్‌బ్యాక్‌లు, నో-కాస్ట్‌ ఈఎంఐల రూపంలో వీటిని అందించనుంది.

Published : 05 Oct 2023 17:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగ సీజన్‌ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ‘ఫెస్టివ్‌ బొనాంజా (ICICI Bank Festive Bonanza)’ను ప్రకటించింది. రాయితీలు, ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌ల రూపంలో తమ కస్టమర్లకు గరిష్ఠంగా రూ.26,000 వరకు ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తోంది. బ్యాంకు క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, రూపే క్రెడిట్‌ కార్డు ద్వారా యూపీఐ, కార్డ్‌లెస్‌ ఈఎంఐ ద్వారా కొనుగోళ్లు చేసిన కస్టమర్లు ఈ ఆఫర్లను పొందొచ్చు.

పండగ సీజన్‌ (Festival Sale)లో కస్టమర్లు చేసే కొనుగోళ్లు, వారి అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా ఆఫర్లను రూపొందించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI Bank Festive Bonanza) తెలిపింది. ఎలక్ట్రానిక్స్‌, మొబైళ్లు, ఫ్యాషన్‌, జువెలరి, ఫర్నీచర్‌, ట్రావెల్‌, డైనింగ్‌ వంటి వాటిపై చేసే చెల్లింపులపై ఆఫర్లు వర్తిస్తాయని వెల్లడించింది. అలాగే ఐఫోన్‌, మేక్‌మైట్రిప్‌, టాటా న్యూ, వన్‌ప్లస్‌, హెచ్‌పీ, మైక్రోసాఫ్ట్‌, క్రోమా, రిలయన్స్‌ డిజిటల్‌, ఎల్‌జీ, సోనీ, శాంసంగ్‌, తనిష్క్‌, తాజ్‌, జొమాటో, స్విగ్గీ వంటి బ్రాండ్‌లపై ఈ ఆఫర్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అదనంగా ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ పేరిట ప్రత్యేక సేల్‌ నిర్వహించే ఫ్లిప్‌కార్ట్‌తో, ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌’ కోసం అమెజాన్‌తో, ‘బిగ్‌ ఫ్యాషన్‌ ఫెస్టివల్‌ సేల్‌’ కోసం మింత్రాతో చేతులు కలిపినట్లు ఐసీఐసీఐ (ICICI Bank Festive Bonanza) తెలిపింది. పండగ సందర్భంగా గృహ, వాహన రుణాలపై కూడా ప్రత్యేక ఆఫర్లు ఇవ్వనున్నట్లు బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఝా తెలిపారు.

ఐసీఐసీఐ కస్టమర్లకు లభించే ఆఫర్ల వివరాలు(ICICI Bank Festive Bonanza offers)..

  • కొన్ని బ్రాండ్ల ఉత్పత్తుల ఆన్‌లైన్‌ షాపింగ్‌, ఇ-కామర్స్‌ వేదికలైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, మింత్రా, టాటా క్లిక్‌లో చేసే కొనుగోళ్లపై 15% వరకు రాయితీ లభిస్తుంది.
  • ఎల్‌జీ, శాంసంగ్‌, సోనీ, యురేకా ఫోర్బ్స్‌, వర్ల్‌పూల్‌ సహా మరికొన్ని ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల కొనుగోళ్లపై తమ కస్టమర్లకు రూ.26 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుందని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. బోస్‌ స్పీకర్లపై 10 శాతం, గరిష్ఠంగా రూ.6,000 వరకు రాయితీ ఉంది. జేబీఎల్‌ బ్రాండ్‌లో ఎంపిక చేసిన ఉత్పత్తులపై 25 శాతం వరకు, గరిష్ఠంగా రూ.12,000 క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. రిలయన్స్ డిజిటల్‌, క్రోమా, విజయ్‌ సేల్స్‌లో చేసే కొనుగోళ్లపైనా రాయితీలు ఉన్నాయి.
  • యాపిల్‌, వన్‌ప్లస్‌, మోటోరోలా, ఒప్పో, షావోమి, రియల్‌మీ మొబైళ్లపై రాయితీలు, ఈఎంఐ ఆఫర్లు ఉన్నాయి. రూ.2,457తో ప్రారంభమయ్యే నెలవారీ ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకుంటే ఐఫోన్‌ 15పై నో-కాస్ట్‌ ఈఎంఐ ఆఫర్‌ ఉంది.
  • లైఫ్‌స్టయిల్‌, ఫాస్ట్రాక్‌, మింత్రా, సెంట్రోలో చేసే ఫ్యాషన్‌ కొనుగోళ్లపై అదనంగా 10 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.
  • మేక్‌మైట్రిప్‌, యాత్ర, క్లియర్‌ట్రిప్‌, ఈజ్‌మైట్రిప్‌ వంటి వేదికలపై చేసుకునే ట్రావెల్‌ బుకింగ్‌లపై రాయితీ లభిస్తుంది.
  • జొమాటో, స్విగ్గీ, ఈజీడైనర్‌, మెక్‌డొనాల్డ్స్‌ వంటి వాటిలో చేసే ఆహారపదార్థాల కొనుగోళ్లపై తగ్గింపు ఉంటుంది.
  • సినీపోలీస్‌లో సినిమా టికెట్ల కొనుగోలు, సోనీలివ్‌ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌పై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. 
  • పెప్పర్‌ఫ్రై, అర్బన్‌ ల్యాడర్‌, డ్యూరోఫ్లెక్స్‌ వంటి ఫర్నీచర్‌ బ్రాండ్లపై 10 శాతం వరకు రాయితీ లభిస్తుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని