ICICI bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.11,053 కోట్లు

ICICI bank Q3 results: ఐసీఐసీఐ బ్యాంక్‌ మెరుగైన త్రైమాసిక ఫలితాలను నమోదు చేసింది. క్యూ3లో రూ.11,053 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

Updated : 20 Jan 2024 19:37 IST

ICICI bank | ముంబయి: ప్రైవేటు రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంకు (ICICI bank) మెరుగైన ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.11,052.60 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.8,792.42 కోట్లతో పోలిస్తే 25.2 శాతం మేర వృద్ధి చెందింది.

స్టాండ్ లోన్‌ పద్ధతిన బ్యాంక్‌ నికర లాభం 23.6 శాతం వృద్ధితో రూ.10,272 కోట్లుగా నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 13.4 శాతం వృద్ధి చెంది రూ.18,678 కోట్లుగా బ్యాంక్‌ పేర్కొంది. ఇతర ఆదాయం 19.8 శాతం వృద్ధితో రూ.5,975 కోట్లు వచ్చినట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రొవిజన్లు రూ.2,257.44 కోట్ల నుంచి రూ.1,049.37 కోట్లకు తగ్గాయి. ఇది నికర లాభం పెరుగుదలకు దోహదం చేసింది.

ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభంలో 18 శాతం వృద్ధి

డిసెంబర్‌ త్రైమాసికంలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 18 శాతం వృద్ధితో రూ.716 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ మొత్తం రూ.605 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.7,064 కోట్ల నుంచి రూ.9,396 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.5,912 కోట్ల నుంచి రూ.7,879 కోట్లకు పెరగడం గమనార్హం. స్థూల ఎన్‌పీఏలు 2.95 శాతం నుంచి 2.04 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.03 శాతం నుంచి 0.68 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్లు రూ.450 కోట్ల నుంచి రూ.655 కోట్లకు పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని