ICICI: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పెన్షన్ ప్లాన్‌.. 100 శాతం ప్రీమియం వాపస్‌

ICICI: ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌ కొత్త పెన్షన్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది.

Published : 18 Jan 2024 22:54 IST

ICICI Prudential | దిల్లీ: ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాత జీవితానికి కచ్చిత‌మైన ఆదాయాన్ని అందించేంద‌కు ఐసీఐసీఐ (ICICI) ఫ్రుడెన్షియల్‌ లైఫ్ ఇన్సురెన్స్ ఒక కొత్త పెన్షన్‌ ప్లాన్‌ను గురువారం అందుబాటులోకి తీసుకొచ్చింది. పాలసీ కొనుగోలు చేసిన తర్వాత ఏ సమయంలో సరెండర్‌ చేసినా చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని పూర్తిగా వాపసు పొందే సదుపాయంతో దీన్ని లాంచ్‌ చేసింది. బీమా రంగంలో ఈ తరహా యాన్యుటీ ప్లాన్‌ తీసుకురావడం ఇదే తొలిసారి అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌  పేర్కొంది.

ఇందులో రెండు రకాల ఆప్షన్లు అందిస్తోంది. సింగిల్‌ లైఫ్‌ను ఎంచుకుంటే.. ప్లాన్‌ తీసుకున్న వ్యక్తి జీవించి ఉన్నంత కాలం ఆదాయం పొందొచ్చు. అదే జాయింట్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే.. పాలసీదారు మరణిస్తే.. ఆ వ్యక్తి జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిందండ్రులు లేదా తోబుట్టువులకు ఆదాయం లభిస్తుంది. దీనిపై రుణ సదుపాయం కూడా ఉందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని