‘గోల్డెన్‌ ఇయర్స్‌’ గడువు పెంపు : ఐసీఐసీఐ బ్యాంక్‌

పెద్దల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ‘గోల్డెన్‌ ఇయర్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌’ వ్యవధిని పెంచుతున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రకటించింది. 7.5 శాతం వడ్డీ రేటును అందించే

Updated : 09 Apr 2023 23:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: పెద్దల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ‘గోల్డెన్‌ ఇయర్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌’ వ్యవధిని పెంచుతున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రకటించింది. 7.5 శాతం వడ్డీ రేటును అందించే ఈ పథకం ఈ ఏడాది అక్టోబరు 31 వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ఇంతకుముందు ప్రకటించిన మేరకు ఈనెల 7 వరకే ఈ పథకం గడువుండేది. కొత్తగా డిపాజిట్లు చేసుకునే వారితో పాటు, పునరుద్ధరించుకునే వారికీ ఈ రేటు వర్తిస్తుందని తెలిపింది. 5 ఏళ్ల ఒక రోజు నుంచి 10ఏళ్ల వ్యవధికి ఈ డిపాజిట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యవధికి సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6.9 శాతం వడ్డీనిస్తుండగా, గోల్డెన్‌ ఇయర్స్‌ ఎఫ్‌డీపై అదనంగా 60 బేసిస్‌ పాయింట్లను చెల్లిస్తున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని