India GDP: భారత్‌ జీడీపీ వృద్ధి అంచనా 6.8 శాతం-మోర్గాన్‌ స్టాన్లీ

2025 ఆర్థిక సంవత్సరంలో ‘మోర్గాన్‌ స్టాన్లీ’ జీడీపీ వృద్ధి అంచనాను 6.50 శాతం నుంచి 6.80 శాతానికి పెంచింది.

Published : 27 Mar 2024 23:33 IST

గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ ‘మోర్గాన్‌ స్టాన్లీ’ 2025 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను 6.50 శాతం నుంచి 6.80 శాతానికి పెంచింది. పారిశ్రామిక రంగంలో వృద్ధి, మూలధన వ్యయం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ‘మోర్గాన్‌ స్టాన్లీ’ జీడీపీ వృద్ధి అంచనాను పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనా 7.90 శాతంగా ఉందని కంపెనీ తన నివేదికలో పేర్కొంది. గ్రామీణ, పట్టణ వినియోగం..ప్రైవేట్‌-పబ్లిక్‌ పెట్టుబడుల మధ్య అంతరాలు వచ్చే ఆర్థిక సంవత్సరం(2025-26)లో తక్కువగా ఉంటాయని సంస్థ తెలిపింది. ఉత్పాదకత మెరుగవ్వడం వల్ల భారత్‌లో వృద్ధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని ‘మోర్గాన్‌’ పేర్కొంది. దేశీయ డిమాండ్‌ వృద్ధి స్థిరంగా ఉండడంతో ఆర్థిక వ్యవస్థకు మేలు జరగనుంది. జీడీపీలో వస్తు/సేవల వినియోగం 60.30 శాతంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని