USA-India: మా రైతులకు ప్రయోజనం చేకూరేలా భారత్‌ నిర్ణయం: అమెరికా

USA-India: డబ్ల్యూటీఓ వివాదాల పరిష్కారం తర్వాత కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాలు తగ్గించినట్లు అగ్రరాజ్యం తెలిపింది.

Published : 17 Apr 2024 08:34 IST

వాషింగ్టన్‌: అమెరికా (USA) రైతులకు ప్రయోజనం చేకూరేలా భారత్‌ తన మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్ (Joe Biden) అడ్మినిస్ట్రేషన్‌లోని కీలక అధికారి తెలిపారు. కొన్ని డబ్ల్యూటీఓ వివాదాలను పరిష్కరించుకోవడం ద్వారా ఇది సాధ్యమైందని వెల్లడించారు. బైడెన్‌ వాణిజ్య విధాన రూపకల్పనపై ఏర్పాటైన హౌస్‌ కమిటీకి ఆ దేశ వాణిజ్య ప్రతినిధి కేథరీన్‌ టాయ్‌ ఈ విషయాన్ని మంగళవారం వివరించారు.

‘‘గత జూన్‌లో భారత్‌- అమెరికా ఆరు WTO వివాదాలను పరిష్కరించుకున్నాయి. దీంతో అనేక యూఎస్‌ (USA) ఉత్పత్తులపై సుంకాలను తొలగించడానికి భారత్‌ అంగీకరించింది. ఫలితంగా మిషిగన్‌, ఒరెగాన్‌, వాషింగ్టన్‌తో సహా దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనం చేకూరింది. శనగలు, కాయధాన్యాలు, బాదం, వాల్‌నట్‌లు, యాపిళ్లకు భారత మార్కెట్‌ అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్‌లో మరికొన్ని వివాదాలు పరిష్కారమయ్యాయి. ఫలితంగా టర్కీకోళ్లు, బాతులు, బ్లూబెర్రీలు, క్రాన్‌బెర్రీలపై సుంకాలు మరింత తగ్గాయి. దీంతో ఆయా ఉత్పత్తులకు భారత్‌ మార్కెట్‌లో యాక్సెస్‌ సులభతరమైంది’’ అని చట్టసభ్యులకు కేథరీన్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని