Renewable Energy: పునరుత్పాదక విద్యుత్‌పై రూ.32 లక్షల కోట్ల పెట్టుబడి

భారత్‌.. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని చేరుకోవడానికి దాదాపు రూ.31.95 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టవలసి ఉంటుందని మూడీస్‌ రేటింగ్స్‌ అంచనా.

Published : 06 Jun 2024 19:53 IST

దిల్లీ: 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత్‌.. 385 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.31.95 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టవలసి ఉంటుందని ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మూడీస్‌ రేటింగ్స్‌ గురువారం తెలిపింది. అయితే, రాబోయే దశాబ్దం వరకు బొగ్గు, విద్యుత్‌ ఉత్పత్తికి కీలక వనరుగా ఉంటుందని మూడీస్‌ పేర్కొంది. భారత్‌ తన 500 GW లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి సంవత్సరం 50 GW శిలాజయేతర ఇంధన సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. అయితే దాదాపు 44 GW వార్షిక సామర్థ్య లక్ష్యాన్ని భారత్‌ సాధిస్తుందని మూడీస్‌ అంచనా వేసింది. పునరుత్పాదక శక్తిలో స్థిరమైన వృద్ధి ఉన్నప్పటికీ, వీటిలో ఎక్కువ భాగం సౌరశక్తిగా ఉండొచ్చు. దేశంలో పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తిలో ప్రైవేట్‌ సంస్థలు కీలకపాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా, అదానీ గ్రూప్‌ ద్వారా అదానీ గ్రీన్‌ ఎనర్జీ.. 2030 నాటికి 45 GW పునరుత్పాదక విద్యుత్‌ శక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని