India GDP: క్యూ3లో జీడీపీ వృద్ధి 8.4%

India GDP in q3: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 8.4 శాతం వృద్ధి నమోదైనట్లు ఎన్‌ఎస్‌వో తెలిపింది.

Published : 29 Feb 2024 19:23 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) మూడో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 8.4 శాతం వృద్ధి నమోదు చేసింది. తయారీ, మైనింగ్‌, నిర్మాణరంగాలు పుంజుకోవడంతో ఇది సాధ్యమైంది. ఈమేరకు కేంద్ర గణాంక కార్యాలయం (NSO) గురువారం సంబంధిత గణాంకాలను వెల్లడించింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో అంచనాలను గణాంక కార్యాలయం వెలువరించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను జనవరిలో 7.3 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. తాజాగా దాన్ని 7.6 శాతానికి సవరించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని