Indigo: మహిళల కోసం ఇండిగో కొత్త సదుపాయం

బస్సుల్లో సీట్‌ రిజర్వ్‌ చేసుకునేప్పుడు, ఒంటరి మహిళ పక్క సీట్‌ మరో మహిళకు మాత్రమే రిజర్వ్‌ అవుతోంది. ఇప్పుడు విమానయాన సంస్థ ఇండిగో కూడా ఈ తరహా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Published : 30 May 2024 03:40 IST

స్సుల్లో సీట్‌ రిజర్వ్‌ చేసుకునేప్పుడు, ఒంటరి మహిళ పక్క సీట్‌ మరో మహిళకు మాత్రమే రిజర్వ్‌ అవుతోంది. ఇప్పుడు విమానయాన సంస్థ ఇండిగో కూడా ఈ తరహా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఒంటరిగా వెళ్తున్న మహిళ.. విమానంలో సీట్‌ రిజర్వ్‌ చేసుకునేందుకు, మరో మహిళ పక్క సీటు ఎంచుకునే వీలును ఇది కల్పించనుంది. అప్పటికే రిజర్వ్‌ చేసుకున్న ఇతర మహిళా ప్రయాణికుల సీట్ల గురించి, వెబ్‌ చెక్‌-ఇన్‌ సమయంలో మహిళలు తెలుసుకునే ఏర్పాటు చేసినట్లు సంస్థ బుధవారం వెల్లడించింది. మహిళా ప్రయాణికులకు మరింత సౌకర్యవంత ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఈ సదుపాయాన్ని అమల్లోకి తెచ్చినట్లు వివరించింది. ‘ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలో ఉంది. మహిళల వెబ్‌చెక్‌ ఇన్‌ సమయంలో మాత్రమే అప్పటికే బుక్‌ చేసుకున్న మహిళల సీట్లు కనిపిస్తాయి. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లే మహిళలతో పాటు, ఒంటరిగా ప్రయాణించే మహిళల సీట్లూ ఉంటాయ’ని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని