IndiGo: ‘పక్క సీటు ఎవరిదో తెలుసుకోవచ్చు..’ మహిళల కోసం ఇండిగో ప్రత్యేక ఫీచర్‌

IndiGo: విమానంలో మహిళలు ఏయే సీట్లు బుక్‌ చేసుకున్నారో తెలియజేసేలా ఇండిగో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తెచ్చింది.

Published : 29 May 2024 13:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) సరికొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. విమానంలో మహిళలు ఎక్కడెక్కడ సీట్లు బుక్‌ చేసుకున్నారో తెలియజేసేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో, ఇకపై మహిళలు వెబ్‌ చెక్‌-ఇన్‌ సమయంలో ఇతర మహిళా ప్రయాణికులు (Female Passengers) బుక్‌ చేసుకున్న సీట్లు ఏంటో చూడొచ్చు. వాటిని బట్టి తమ సీట్లను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది.

‘‘ఈ ఫీచర్‌తో వెబ్‌ చెక్‌-ఇన్‌ సమయంలో మాత్రమే మహిళా ప్రయాణికులు బుక్‌ చేసుకున్న సీట్ల (Flight seats Booking)ను చూడొచ్చు. ఒంటరిగా ప్రయాణించే మహిళలతో పాటు ఫ్యామిలీ బుకింగ్స్‌కు కూడా ఇది వర్తిస్తుంది. ప్రస్తుతానికి పైలట్‌ మోడ్‌లో దీన్ని అందుబాటులోకి తెచ్చాం. ఈ ఆప్షన్‌ తీసుకురావడానికి ముందు మార్కెట్ రీసెర్చ్‌ చేశాం. మహిళలకు సౌకర్యవంతమైన, భద్రమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం’’ అని ఇండిగో తమ ప్రకటనలో వెల్లడించింది.

రియల్‌ ఎస్టేట్‌ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్‌?

రూ.1199తో స్పెషల్‌ సేల్‌..

దీంతో పాటు తమ దేశీయ అంతర్జాతీయ విమానాల్లో ఇండిగో ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఇందులో టికెట్‌ ధరలు రూ.1199 నుంచే టికెట్‌ ధరలు ప్రారంభం కానున్నాయి. నేటి (మే 29) నుంచి మే 31వ తేదీ వరకు ఈ సేల్‌ అందుబాటులో ఉండనుంది. జులై 1 నుంచి సెప్టెంబరు 30 మధ్య ప్రయాణాల బుకింగ్‌కు వర్తిస్తుంది. అంతేగాక, కస్టమర్లు కోరుకున్న సీట్లకు విధించే ఛార్జీలపై 20శాతం వరకు డిస్కౌంట్‌ కూడా పొందొచ్చని విమానయాన సంస్థ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు