Inequality: భారీగా పెరిగిన ఆర్థిక అసమానతలు.. 1శాతం సంపన్నుల చేతుల్లోనే 40% సంపద!

గడిచిన రెండు దశాబ్దాల నుంచి దేశంలో ఆర్థిక అసమానతలు భారీగా పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Published : 20 Mar 2024 22:50 IST

దిల్లీ: గడిచిన రెండు దశాబ్దాల నుంచి దేశంలో ఆర్థిక అసమానతలు భారీగా పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2022-23లో ఒకశాతం సంపన్న వర్గాల ఆదాయం 22.6శాతానికి పెరగగా, వారి సంపద 40శాతానికి చేరుకున్నట్లు తాజా నివేదిక పేర్కొంది. ‘ఇన్‌కం అండ్‌ వెల్త్‌ ఇన్‌ఈక్వాలిటీ ఇన్‌ ఇండియా: ది రైజ్‌ ఆఫ్‌ ది బిలియనీర్‌ రాజ్‌’ పేరుతో విడుదలైన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

‘సంపన్నుల్లో తొలి ఒక శాతం ఉన్నవారి ఆదాయం, సంపద 2022-23నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీనిలో భారత్‌ వాటా ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. దక్షిణ ఆఫ్రికా, బ్రెజిల్, అమెరికా కంటే ఇది ఎక్కువ’ అని తాజా నివేదిక వెల్లడించింది. 2014-15, 2022-23 మధ్యకాలంలో అగ్రశ్రేణి అసమానతల్లో భారీ పెరుగుదల కనిపించిందని పేర్కొంది.

థామస్‌ పికెట్టీ (పారిస్‌ స్కూల్ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ వరల్డ్‌ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్‌), ల్యూకాస్‌ ఛాన్సెల్‌ (హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ అండ్‌ వరల్డ్‌ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్‌), నితిన్‌ కుమార్‌ భారతీ (న్యూయార్క్‌ యూనివర్సిటీ అండ్‌ వరల్డ్‌ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్‌) ఈ నివేదికను రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు