Coalition Governments: సంకీర్ణ ప్రభుత్వాలతో మార్కెట్లకు మేలా? కీడా?

సంకీర్ణ ప్రభుత్వాల పాలనా కాలంలో స్టాక్‌ మార్కెట్లు రాణించవనే అభిప్రాయం సరికాదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాన మంత్రిగా వి.పి.సింగ్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ సమయంలో స్టాక్‌ మార్కెట్లు 95 శాతం ప్రతిఫలాన్ని పంచిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

Updated : 05 Jun 2024 02:46 IST

సంకీర్ణ ప్రభుత్వాల పాలనా కాలంలో స్టాక్‌ మార్కెట్లు రాణించవనే అభిప్రాయం సరికాదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాన మంత్రిగా వి.పి.సింగ్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ సమయంలో స్టాక్‌ మార్కెట్లు 95 శాతం ప్రతిఫలాన్ని పంచిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. పి.వి.నరసింహారావు పాలనా కాలంలో, మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా మొదటి అయిదేళ్లలోనూ మన మార్కెట్లు 180%  రాణించడాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మారినప్పుడు లేదా బలహీన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతింటుందని అనడంలో సందేహం లేదని వివరిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా, తమ పాలనా కాలంలో చేపట్టబోయే కార్యాచరణపై స్పష్టమైన మార్గసూచీతో ముందుకెళితే.. స్టాక్‌ మార్కెట్లు కూడా తదనుగుణంగా రాణించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఒకటే పార్టీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు నిర్ణయాల విషయంలో పూర్తి స్వేచ్ఛ లభిస్తుందని, అప్పుడు సంస్కరణలు సత్వరం చేపట్టే వీలుంటుందని పేర్కొంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా, ఆర్థిక అంశాల్లో సహచర పార్టీలను ఒప్పించగలిగితే, వృద్ధిపరంగా దూసుకెళ్లడంతో పాటు స్టాక్‌మార్కెట్లు కూడా రాణిస్తాయని గుర్తు చేస్తున్నారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడే ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలు చేయడం వల్లే స్టాక్‌మార్కెట్లూ దూసుకెళ్లడాన్ని ప్రస్తావిస్తున్నారు. మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోనూ స్నేహపూర్వక పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని విజయవంతంగా నడపడమే కాక, ఆర్థిక వ్యవస్థ రాణించేలా చేశారనీ చెబుతున్నారు. 


గ్జిట్‌ పోల్స్‌ ద్వారా మార్కెట్లకు మోదీ ఇచ్చిన కృత్రిమ బూస్టర్‌ డోసు కాస్తా, ఎన్నికల ఫలితాలతో నీరసించిపోయింది. 2004 మే 17న ఇదే తరహాలో మార్పు కనిపించినపుడు మన్మోహన్‌ సింగ్‌ చెప్పిన మాటలు గుర్తు చేసుకుందాం. మదుపర్లు భయపడాల్సిన పనే లేదని.. ద్రవ్య క్రమశిక్షణ, వృద్ధి దిశగా పన్ను విధానాలను యూపీఏ ప్రకటిస్తుందని అన్నారు. అన్నట్లే 2004-2014 మధ్య ప్రైవేటు రంగానికి గట్టి ఊతం లభించింది. అత్యధిక జీడీపీ వృద్ధి నమోదైంది. 

కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని