IRDAI: బీమా పాలసీల సరెండర్‌ నిబంధనలపై ఐఆర్‌డీఏఐ వెనక్కి

surrender value: బీమా పాలసీల సరెండర్‌ నిబంధనలపై ఐఆర్‌డీఏఐ వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఉన్న విలువలనే కొనసాగించాలని నిర్ణయించింది.

Published : 25 Mar 2024 21:13 IST

దిల్లీ: బీమా పాలసీల సరెండర్‌ విలువలకు సంబంధించి నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) వెనక్కి తగ్గింది. సవరించిన సరెండర్‌ విలువల విషయంలో బీమా సంస్థల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సరెండర్‌ విలువ పెంచడం వల్ల మధ్యలోనే పాలసీ హోల్డర్లు నిష్క్రమించే అవకాశం ఉందని ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఆందోళన వ్యక్తంచేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

మెచ్యూరిటీ తేదీ కంటే ముందే పాలసీలను ముగిస్తే.. పాలసీదారుడికి బీమా కంపెనీలు చెల్లించే మొత్తాన్ని సరెండర్‌ విలువగా పరిగణిస్తారు. పాలసీ కాలవ్యవధి ఉంటుండగానే మధ్యలోనే పాలసీదారుడు సరెండర్‌ చేస్తే వారికి వచ్చిన ఆదాయం, పొదుపు చేసిన భాగాన్ని చెల్లిస్తారు. ఎక్కువకాలం పాలసీలను కొనసాగిస్తే, వారికి సరెండర్‌ విలువ ఎక్కువగా ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం.. మూడేళ్ల కాల వ్యవధిలోపు పాలసీలను సరెండర్‌ చేస్తే.. వాటి విలువ యథాతథంగా లేదా, తక్కువగా ఉండే అవకాశం ఉంది. 4-7 సంవత్సరాల మధ్య పాలసీలను సరెండర్‌ చేస్తే, వాటి విలువ స్వల్పంగా పెరుగుతుంది. ఈ నిబంధనలను ఏప్రిల్‌ 1 నుంచి అమలుచేయాలని ఐఆర్‌డీఏఐ నిర్ణయించింది. బీమా సంస్థల నుంచి అభ్యంతరాల నేపథ్యంలో పాత విలువలనే కొనసాగించేందుకు అంగీకరించింది. అలాగే ఇండెక్స్‌ లింక్డ్‌  ఇన్సూరెన్స్‌ ప్రొడక్ట్‌లను విక్రయించేందుకూ ఆయా సంస్థలకు అనుమతిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని