Bluesky: ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. ప్రస్తుతానికి వారికి మాత్రమే..!
Bluesky: ట్విటర్‌కు పోటీగా తీసుకొస్తున్నట్లు భావిస్తున్న బ్లూస్కై అనే సామాజిక మాధ్యమం ఐఓఎస్ యూజర్లకు యాప్ స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే దీని యాక్సెస్ ఉంది.
Bluesky: ట్విటర్ సహ-వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సే (Jack Dorsey) తన కొత్త సామాజిక మాధ్యమం బ్లూస్కై (BlueSky) బీటా వెర్షన్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది యాపిల్ యాప్ స్టోర్‌లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
డేటా.ఏఐ అనే యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ వివరాల ప్రకారం.. ఐఓఎస్ యాప్ స్టోర్‌లో బ్లూస్కై (BlueSky) ఫిబ్రవరి 17నే అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు 2,000 మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ప్లస్ బటన్‌ను క్లిక్ చేసి 256 క్యారెక్టర్లతో కూడిన పోస్ట్‌ను క్రియేట్ చేసేలా యాప్ ఇంటర్‌ఫేస్‌ను డిజైన్ చేశారు. ట్విటర్ పోస్ట్ బాక్స్‌లో ‘‘"What's happening?’’ అని అడుగుతుండగా.. బ్లూస్కైలో దాన్ని ‘‘What's up?’’గా మార్చారు. షేర్, మ్యూట్, బ్లాక్ అకౌంట్స్ వంటి ఫీచర్లు సైతం ఉన్నట్లు డేటా.ఏఐ పేర్కొంది.
యాప్ నావిగేషన్‌లో మధ్యలో డిస్కవర్ అనే ట్యాబ్‌ను పొందుపర్చినట్లు డేటా.ఏఐ వెల్లడించింది. ఎవర్ని ఫాలో కావాలి, రీసెంట్ పోస్ట్‌ల వంటి వాటిని సెర్చ్ చేయడానికి అది ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది. మరో ట్యాబ్‌లో నోటిఫికేషన్లు, లైక్స్, రీపోస్ట్‌లు, ఫాలోస్, రిప్లైలు.. ఇలా ట్విటర్ తరహా ఫీచర్లు ఉన్నట్లు సమాచారం. కావాల్సిన వారి కోసం సెర్చ్ చేసి ఫాలో అయ్యే ఆప్షన్ కూడా ఉంది. యూజర్ ఫ్రొఫైల్‌లో ప్రొఫైల్ పిక్, బ్యాగ్రౌండ్, బయో, మెట్రిక్స్ అనే ఆప్షన్లున్నాయి.
2019లో బ్లూస్కై ప్రాజెక్టు ప్రారంభమైంది. కానీ, కంపెనీ మాత్రం 2022లో ఉనికిలోకి వచ్చింది. ట్విటర్‌ను వీడిన తర్వాతే డోర్సే తొలిసారి బ్లూస్కై గురించి మాట్లాడారు. దీన్ని ‘ఓపెన్ డిసెంట్రలైజ్డ్ స్టాండర్డ్ ఫర్ సోషల్ మీడియా’గా అభివర్ణించారు. సామాజిక మాధ్యమ ప్రాథమిక అంశాలను, యూజర్ల డేటాను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న కంపెనీలకు బ్లూస్కై పోటీనిస్తుందని గత అక్టోబర్‌లో ప్రకటించారు. పరోక్షంగా ట్విటర్‌కు పోటీగా దీన్ని తీసుకొస్తున్నట్లు సంకేతాలిచ్చారు. బ్లూస్కై గత ఏడాది 13 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. డోర్సే కంపెనీ బోర్డులో ఉండగా.. ట్విటర్ మాజీ సెక్యూరిటీ ఇంజినీర్ సైతం ఇటీవలే చేరినట్లు బ్లూస్కై ఇటీవల ట్వీట్ చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TTD: కొవిడ్ తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది: వైవీ సుబ్బారెడ్డి
-
World News
ISI: పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ రెండో ర్యాంక్ స్థాయి అధికారి హతం..!
-
India News
Amritpal Singh: 45 నిమిషాలు గురుద్వారాలో ఉండి.. పూజారి ఫోన్ వాడి..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Dhamki: ‘ధమ్కీ’కి బదులు ఆ సినిమా వేసిన థియేటర్ సిబ్బంది.. ప్రేక్షకులు షాక్
-
Politics News
Kishan Reddy: ఈ ఏడాది దేశానికి, తెలంగాణకు కీలకం: కిషన్‌రెడ్డి