Jeff Bezos: టీవీ, ఫ్రిజ్‌ కొనొద్దు.. డబ్బు దాచుకోండి: ప్రజలకు బెజోస్‌ సూచన

ఆర్థికమాంద్యం భయాల వేళ.. అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్‌ కొన్ని సూచనలు చేశారు. కొనుగోళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలన్నారు.

Published : 18 Nov 2022 14:10 IST

వాషింగ్టన్: ఖర్చు విషయంలో దిగ్గజ వ్యాపారవేత్త, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్‌ ప్రజలకు సూచనలు చేశారు. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందని హెచ్చరించిన ఆయన కొన్ని చిట్కాలు చెప్పారు. ఈ హాలిడే సీజన్‌లో అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలని, డబ్బు దాచుకోవాలని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

‘మీరు ఒక పెద్ద టీవీ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా..? కాస్త ఆగండి. మీ నగదును మీ దగ్గరే ఉంచుకోండి. టీవీ, ఫ్రిజ్‌, కారు ఏదైనా కావొచ్చు.. రిస్క్‌కు కాస్త దూరంగా ఉండండి. వ్యాపారాన్ని విస్తరించేందుకు పెట్టుబడి విషయంలో కూడా చిన్నవ్యాపారవేత్తలు కాస్త ఆలోచించండి. కొనుగోలుకు బదులు నగదు నిల్వలు పెంచుకోండి. అంతా మంచి జరగాలని ఆశిద్దాం. అలాగే కష్టకాలానికి కూడా సిద్ధంగా ఉందాం’ అని బెజోస్ సూచించారు.

బెజోస్‌ 124 బిలియన్ల( సుమారు రూ.10 లక్షల కోట్లు) సంపద కలిగి ఉన్నారని అంచనా. ఈ క్రమంలో బెజోస్.. తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన సంపదలో పెద్ద మొత్తాన్ని పర్యావరణ పరిరక్షణ కోసం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. అమెజాన్‌ సంస్థ కూడా ఉద్యోగుల లేఆఫ్‌ల జాబితాలో చేరింది. ఆ సంస్థ పదివేలమంది ఉద్యోగులను తొలగిస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పటికే ట్విటర్, మెటా వంటి సామాజిక మాద్యమ సంస్థలు భారీ లేఆఫ్‌లు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఈ ఉద్వాసనలు చోటుచేసుకుంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని