Jio Finance: ‘జియో ఫైనాన్స్‌’ యాప్‌

యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌), డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా ‘జియో ఫైనాన్స్‌’ బీటా/ పైలట్‌ వెర్షన్‌ యాప్‌ను విడుదల చేసినట్లు జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ గురువారం వెల్లడించింది.

Published : 31 May 2024 03:49 IST

దిల్లీ: యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌), డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా ‘జియో ఫైనాన్స్‌’ బీటా/ పైలట్‌ వెర్షన్‌ యాప్‌ను విడుదల చేసినట్లు జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ గురువారం వెల్లడించింది. ఈ యాప్‌తో డిజిటల్‌ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు, బిల్లుల చెల్లింపు, బీమా సలహాదారు వంటి సేవలు పొందొచ్చని జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తెలిపింది. భవిష్యత్తులో రుణాలకు విస్తరిస్తామని పేర్కొంది. ఈ యాప్‌ ద్వారా జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ అకౌంట్‌ వెంటనే డిజిటల్‌గా ప్రారంభించొచ్చని తెలిపింది.  

జియో సినిమా ఐపీఎల్‌ రికార్డులు: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో సినిమా, ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రసారాల్లో రికార్డులు నెలకొల్పింది. 2024 ఐపీఎల్‌ సీజన్‌లో జియో సినిమా వేదికగా మ్యాచ్‌ వీక్షించిన వారి సంఖ్య 62 కోట్లకు చేరింది. 2023 సీజన్‌తో పోలిస్తే, ఈ సంఖ్య 53% అధికం. తాజా సీజన్‌లో 35,000 కోట్ల నిమిషాల వాచ్‌టైమ్‌ను నమోదు చేసింది. ఒక్కో వీక్షకుడు సగటున 75 నిమిషాలు వెచ్చించారు. గతేడాది ఇది 60 నిమిషాలుగా ఉంది. 

ఐపీఎల్‌కు వచ్చిన స్పందన దృష్టిలో ఉంచుకుని 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ను కూడా జియో సినిమా ద్వారా వీక్షించే సదుపాయాన్ని అందించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ పోటీలు జులై 26న ప్రారంభం కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని