RBI Policy: ఆర్‌బీఐ పాలసీలో ‘కీ ఫాక్ట్‌ స్టేట్‌మెంట్‌’ ప్రస్తావన.. ఇంతకీ ఏంటిది?

రుణ సంస్థలు రుణ గ్రహీతలకు రుణంపై విధించే అన్ని ఛార్జీల వివరాలను కీ ఫాక్ట్‌ స్టేట్‌మెంట్‌ (KFS)లో తెలపాలి.

Published : 08 Feb 2024 19:09 IST

ముంబయి: ద్రవ్య విధాన నిర్ణయాలను ప్రకటిస్తూ ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఓ కీలక ప్రకటన చేశారు. వడ్డీ రేట్లతో పాటు అదనంగా విధించే ఇతర ఛార్జీల విషయంలో రుణ సంస్థలు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఇందుకోసం ఆయా ఛార్జీల వివరాలను కీ ఫాక్ట్‌ స్టేట్‌మెంట్‌ (KFS)లో పొందుపరుస్తూ రుణ గ్రహీతలకు జారీ చేయాలని చెప్పారు.

కీ ఫాక్ట్‌ స్టేట్‌మెంట్‌ అంటే బ్యాంకులు, NBFCలు రుణగ్రహీతలకు రుణానికి సంబంధించిన అన్ని నిబంధనలు, షరతులు, ఛార్జీలు, వడ్డీ రేటు గురించి తెలియజేస్తూ జారీ చేసే పత్రం. ఈ చర్య వల్ల రుణగ్రహీతలకు రుణంపై చెల్లించే వాస్తవ వార్షిక వడ్డీ రేటు సమాచారం తెలుస్తుంది. ఇది డిజిటల్‌ లెండింగ్‌ యాప్‌లకు మాత్రమే కాకుండా అన్ని రిటైల్‌, MSME రుణాలపై అన్ని బ్యాంకులు, NBFCలకు వర్తిస్తుంది. దీని కారణంగా రుణసంస్థలు హిడెన్‌ ఛార్జీలు విధించే అవకాశం బాగా తగ్గే అవకాశం ఉంది. బ్యాంకులు, NBFCలు రుణాలు ఇచ్చేటప్పుడు వడ్డీ రేటు మాత్రమే కాకుండా.. డాక్యుమెంటేషన్‌ ఛార్జీలు, ప్రాసెసింగ్‌ ఫీజులు మొదలైన ఇతర ఛార్జీలను విధిస్తాయి. అలాగే, రుణ ఒప్పందానికి సంబంధించిన కీలక సమాచారాన్ని సరళమైన భాషలో సులభంగా అర్థమయ్యేలా అందించాలని ఆర్థిక సంస్థలకు సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు