Kia recall: కియా సెల్టోస్‌ కార్ల రీకాల్‌.. కారణం ఇదే..

Kia recalls: కియా కంపెనీ సెల్టోస్‌ మోడల్‌ కార్లను రీకాల్ చేసింది. 4 వేల కార్లను వెనక్కి రప్పిస్తోంది.

Published : 23 Feb 2024 16:55 IST

Kia seltos | దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా (Kia) స్వచ్ఛందంగా కార్ల రీకాల్‌ చేపట్టింది. పెట్రోల్‌ వేరియంట్‌ సెల్టోస్‌ మోడల్‌కు చెందిన 4,358 యూనిట్లను వెనక్కి రప్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఎలక్ట్రానిక్‌ ఆయిల్‌ పంప్‌ కంట్రోలర్‌ను మార్చేందుకు ఈ రీకాల్ చేపట్టినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 2023 ఫిబ్రవరి 28 నుంచి జులై 13 మధ్య తయారైన ఐవీటీ ట్రాన్స్‌మిషన్‌ కలిగిన పెట్రోల్‌ మోడల్‌ను వెనక్కి రప్పిస్తున్నామని కియా పేర్కొంది. 

ఎలక్ట్రానిక్‌ ఆయిల్‌ పంప్‌ కంట్రోలర్‌లో ఎర్రర్‌ దాని పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది. లోపం ఉన్నవాటిని ఉచితంగానే రీప్లేస్ చేస్తామని చెప్పింది. రీకాల్ విషయాన్ని కేంద్ర జాతీయ రహదారులు, రవాణా మంత్రిత్వశాఖకు తెలియజేసింది. ఈవిషయమై కార్ల యజమానులకు సమాచారం ఇస్తామని పేర్కొంది. కియా దేశీయంగా సెల్టోస్‌తో పాటు సోనెట్‌, కరెన్స్‌ వంటి మోడళ్లను విక్రయిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని