Kotak Result: కోటక్‌ మహీంద్రా బ్యాంక్ నికర లాభం రూ.3,191 కోట్లు

kotak q2 results: కోటక్‌ మహీంద్రా బ్యాంకు సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

Updated : 21 Oct 2023 17:25 IST

దిల్లీ: ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ కోటక్‌ మహీంద్రా సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.3,191 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభం 23.66% పెరిగింది. అప్పటి లాభం రూ.2,581 కోట్లు. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (NII) రూ.5,099 కోట్ల నుంచి రూ.6,297 కోట్లకు పెరిగింది. బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు (NPA) 1.72 శాతంగా నమోదయ్యాయి. గతేడాది ఇది 2.08 శాతంగా ఉంది.

యెస్‌ బ్యాంకు నికర లాభంలో వృద్ధి

యెస్‌ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం 47.4 శాతం పెరిగి రూ.225.21 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం రూ.152.82 కోట్లుగా ఉంది. స్థూల నాన్‌-పెర్ఫార్మింగ్‌ అసెట్‌ (NPA) నిష్పత్తి 2 శాతంగా ఉంది. నికర NPA నిష్పత్తి 0.90 శాతంగా ఉంది. డిపాజిట్లలో గతేడాదితో పోలిస్తే.. 17.20% వృద్ధి నమోదైంది. గత త్రైమాసికంతో పోలిస్తే 6.80% పెరిగి రూ.2.34 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

14% పెరిగిన ఐడీబీఐ బ్యాంకు ఆదాయం

ఐడీబీఐ బ్యాంక్‌ క్యూ2 నికర లాభం 60% పెరిగి రూ.1,323 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదేకాలంలో రూ.828 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. మొత్తం ఆదాయం సైతం రూ.6,066 కోట్ల నుంచి రూ.6,924 కోట్లకు పెరిగింది. బ్యాంకు నికర ఎన్‌పీఏలు 1.15 శాతం నుంచి 0.39 శాతానికి తగ్గాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని