Kotak Mahindra Bank: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ లాభం ₹4,265 కోట్లు

Kotak Mahindra Bank Q3 results: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ మూడో త్రైమాసికంలో రూ.4,265 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

Published : 20 Jan 2024 15:38 IST

ముంబయి: ప్రైవేటు రంగానికి చెందిన కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ (Kotak Mahindra Bank) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో (Q3 Results) బ్యాంక్‌ ఏకీకృత ప్రాతిపదికన 6.75 శాతం వృద్ధితో రూ.4,264.78 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నికర లాభం రూ.3,995.05 కోట్లుగా నమోదైంది.

స్టాండ్ లోన్ పద్ధతిలో కోటక్‌ మహీంద్రా లాభం (పన్నుల అనంతరం) రూ.3,005 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో రూ.2,791.88 కోట్లతో పోలిస్తే అధికం కాగా.. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఆర్జించిన రూ.3,190.97 కోట్లతో పోలిస్తే తక్కువ. మొత్తం ఆదాయం సైతం రూ.10,947 కోట్ల నుంచి రూ.14,096 కోట్లకు పెరిగింది. నిర్వహణ ఖర్చులు రూ.3,751 కోట్ల నుంచి రూ.4,284 కోట్లకు పెరిగాయి.

గతేడాది ఇదే త్రైమాసికంలో ప్రావిజన్లు రూ.149.83 కోట్లు కాగా.. ఈసారి ఆ మొత్తం రూ.578.14 కోట్లకు పెరిగింది. ఇది నికర లాభంపై ప్రభావం చూపింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.72 శాతం కాగా.. ఈసారి 1.73 శాతంగా నమోదైంది. ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల్లో (AIFs) ఇన్వెస్ట్‌మెంట్‌కు గానూ రూ.190.13 కోట్లు కేటాయించినట్లు బ్యాంక్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు