FD Rates: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్ల పెంపు

FD Rates: వివిధ కాలపరిమితులకు సంబంధించిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వడ్డీరేట్లను పెంచింది.

Published : 11 Dec 2023 18:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ప్రైవేట్‌ రంగ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లను (Kotak Mahindra Bank Fixed deposit Rates) పెంచింది. రూ.రెండు కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు కొత్త రేట్లు వర్తిస్తాయి. పెంచిన వడ్డీరేట్లు 2023 డిసెంబర్‌ 11 నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు వెల్లడించింది. ప్రస్తుతం సాధారణ కస్టమర్లకు బ్యాంకు 2.75 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీరేట్లను అందిస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు ఇచ్చే వడ్డీరేటు 3.25 శాతం నుంచి 7.80 శాతం వరకు ఉంది. 

మూడేళ్ల నుంచి నాలుగేళ్ల మధ్య కాలపరిమితితో కూడిన ఎఫ్‌డీపై వడ్డీరేట్లను (FD Rates) తాజాగా కోటక్ మహీంద్రా బ్యాంకు (Kotak Mahindra Bank) 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో ప్రస్తుతం వడ్డీరేటు 6.50 శాతం నుంచి 7 శాతానికి చేరింది. అలాగే నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై వడ్డీరేట్లను (Fixed deposit Rates) 75 బేసిస్‌ పాయింట్లు పెంచి 6.25 శాతం నుంచి 7 శాతానికి చేర్చింది.

రూ.రెండు కోట్లలోపు డిపాజిట్లపై వివిధ కాలపరిమితులకు ప్రస్తుతం ఉన్న వడ్డీరేట్లు..

* మరిన్ని కాలపరిమితులకు సంబంధించిన వడ్డీరేట్లతో పాటు ఇతర వివరాల కోసం కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని