Date center: కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్‌ ప్రారంభం

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో కంట్రోల్‌ఎస్‌ డేటా సెంటర్స్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేసిన ‘హైదరాబాద్‌ డీసీ3’ డేటా సెంటర్‌ను బీఎస్‌ఈ (బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌) ఎండీ, సీఈఓ సుందరరామన్‌ రామమూర్తి ప్రారంభించారు.

Published : 30 May 2024 03:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో కంట్రోల్‌ఎస్‌ డేటా సెంటర్స్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేసిన ‘హైదరాబాద్‌ డీసీ3’ డేటా సెంటర్‌ను బీఎస్‌ఈ (బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌) ఎండీ, సీఈఓ సుందరరామన్‌ రామమూర్తి ప్రారంభించారు. ఇది ‘ఏఐ రెడీ’ డేటాసెంటర్‌. దాదాపు 1.34 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, జోన్‌-2 భూకంపాల ప్రమాణాల ప్రకారం నిర్మించిన అయిదు అంతస్తుల భవనంలో అత్యాధునిక కూలింగ్‌ టెక్నాలజీ, 1,300 ర్యాక్స్, 13 మెగావాట్ల ఐటీ లోడ్‌ సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని నిర్మించేందుకు రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని